విక్టిమ్స్‌కు భరోసా: ఒకే కారులో మోడీ, బాబు(పిక్చర్స్)
విశాఖపట్నం: ‘హుధుద్ తుఫాను మీకు అపారనష్టాన్ని కలిగించింది. కష్టాలను మిగిల్చింది. మీ కష్టాలను.. బాధలను నావిగా భావిస్తున్నా. ఈ ఆపత్కాలంలో మీకు అండగా నిలుస్తా' అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తుఫాను బాధితులకు అభయహస్తం ఇచ్చారు. ఏపీకి రూ.1000 కోట్లు తక్షణసాయాన్ని ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం సుమారు 1.30కు విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగా విమానాశ్రయానికి మోడీ చేరుకున్నారు.
ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి చంద్రబాబు, మోడీ కలిసి రోడ్డుమార్గం మీదుగా విశాఖలోని తుపాను దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించారు. ముందుగా తుపానుధాటికి పూర్తిగా ధ్వంసమైన విశాఖ విమానాశ్రయాన్ని సందర్శించారు. దెబ్బతిన్న ఎయిర్‌పోర్టు లాంజ్‌ను చూసి మోదీ ఆశ్చర్యపోయారు. దీన్ని నిర్మించిన కాంట్రాక్టర్ ఎవరని ప్రశ్నించినట్టు తెలిసింది. అక్కడి నుంచి హైవేమీదుగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు.

విశాఖలో మోడీ
‘హుధుద్ తుఫాను మీకు అపారనష్టాన్ని కలిగించింది. కష్టాలను మిగిల్చింది. మీ కష్టాలను.. బాధలను నావిగా భావిస్తున్నా. ఈ ఆపత్కాలంలో మీకు అండగా నిలుస్తా' అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తుఫాను బాధితులకు అభయహస్తం ఇచ్చారు.

విశాఖలో మోడీ
ఏపీకి రూ.1000 కోట్లు తక్షణసాయాన్ని ప్రకటించారు. హుధుద్‌తో అతలాకుతలమైన నగరాన్ని పరిశీలించేందుకు ప్రధాని మంగళవారం ప్రత్యేక విమానంలో విశాఖ నగరానికి వచ్చారు.

విశాఖలో మోడీ
మంగళవారం మధ్యాహ్నం సుమారు 1.30కు విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగా విమానాశ్రయానికి మోడీ చేరుకున్నారు.
ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు.

విశాఖలో మోడీ
అక్కడి నుంచి చంద్రబాబు, మోడీ కలిసి రోడ్డుమార్గం మీదుగా విశాఖలోని తుపాను దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించారు.

విశాఖలో మోడీ
ఇంతటి విధ్వంసాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న నగరవాసుల ధైర్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మోడీ తెలిపారు. తుఫాను కారణంగా ఆప్తులను కోల్పోయినవారికి ప్రధాని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఒకే కారులో మోడీ-బాబు
అక్కడి నుంచి చంద్రబాబు, మోడీ కలిసి రోడ్డుమార్గం మీదుగా విశాఖలోని తుపాను దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించారు.
ఇంతటి విధ్వంసాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న నగరవాసుల ధైర్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మోడీ తెలిపారు. తుఫాను కారణంగా ఆప్తులను కోల్పోయినవారికి ప్రధాని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తుఫాను మృతుల కుటుంబాలకు కేంద్రం తరఫున రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేల సాయాన్ని అందిస్తామన్నారు. తుఫాన్‌ను ముందుగా అంచనా వేయడంలో వాతావరణ శాఖ విజయవంతమైందని కితాబిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో భారీ ప్రాణనష్టాన్ని నివారించగలిగామన్నారు.
నగరంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ సహాయ కార్యక్రమాలకు కేంద్రం సహకరిస్తుందన్నారు. నగరంలో విద్యు త్తు, తాగునీరు, సమాచార వ్యవస్థలను వేగంగా పునరుద్ధరించాలని కోరారు. తుఫాన్ నష్టంపై సర్వేలు పూర్తయి ఒక అంచనాకు వచ్చిన తర్వాత కేంద్రం నుంచి పూర్తి సహాయం అందజేస్త్తామన్నారు. తుఫాన్ బాధితులకు అండగా నిలిచేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రధాని అభినందించారు. విశాఖ ప్రజలను చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న విశ్వాసం స్పష్టంగా కనిపించిందన్నారు.












Click it and Unblock the Notifications