AP Election: కూటమిలో చిచ్చు రేపిందేంటి ? మోడీని ఏపీకి దూరంగాా ఉంచేస్తుందెవరు ?
ఏపీలో ఎన్నికల ప్రచారం ముగియడానికి కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. ఓవైపు అధికార వైసీపీని సీఎం జగన్ దూకుడుగా జనంలోకి తీసుకెళ్తుంటే.. ఎన్నో ఆశలతో బీజేపీని పొత్తులోకి తెచ్చుకుని ఎన్డీయే కూటమిగా జనంలోకి వెళ్తున్న మిత్రపక్షాలు ఇంకా సమస్యల వలయంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. దీనంతటికీ ప్రధాన కారణం బీజేపీతో టీడీపీ, జనసేన చేస్తున్న స్నేహం. లేదా టీడీపీ-జనసేనతో బీజేపీ చేయక తప్పని స్నేహం.
టీడీపీ-జనసేనతో పొత్తును చివరి నిమిషం వరకూ నాన్చిన బీజేపీ.. చివరికి తప్పనిసరి పరిస్ధితుల్లో మొహమాటంగా కూటమి ఏర్పాటుకు అంగీకరించింది. బీజేపీతో పొత్తుంటే ఎన్నికల వేళ పనికొస్తుందని చంద్రబాబు, పవన్ భావిస్తే.. అదే కూటమిగా పోటీ తామంతా కలిసి పోటీ చేస్తే తమ పార్టీకి కనీస ఎంపీ సీట్లు వస్తాయని ప్రధాని మోడీ భావించారు. ఇక్కడ వరకూ అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది.

రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేనను మతతత్వ పార్టీలుగా పేర్కొంటూ ముస్లింలను వైసీపీ రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. దీంతో సహజంగానే అప్పటికే కాస్తో కూస్తో ముస్లిం ఓట్లున్న ఈ రెండు పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయి. ఈ ప్రభావంతో బీజేపీని దూరం పెట్టడం మొదలుపెట్టాయి. పేరుకే పొత్తు కొనసాగిస్తూ మరోవైపు బీజేపీ అగ్రనేతలు ఏపీకి రాకుండా టీడీపీ, జనసేన జాగ్రత్త పడుతున్నాయి. అలాగే ఉమ్మడి మ్యానిఫెస్టోలో మిగతా వారితో సమానంగా మైనార్టీలకూ వరాలు ప్రకటించాయి.
ఇలా ముస్లింలకు హజ్ యాత్రకు లక్షసాయం, 50 ఏళ్లకే రిజర్వేషన్, హజ్ హౌస్ నిర్మాణం వంటి హామీలు ఇవ్వడం ద్వారా కూటమిలో ఉన్నా తాము ముస్లింలను విస్మరించలేదనే సంకేతాలు పంపేందుకు టీడీపీ, జనసేన ప్రయత్నించాయి. కానీ బీజేపీ లెక్కలు వేరు. ఇప్పుడు ఏపీలో పరిస్దితులను దృష్టిలో ఉంచుకుని ముస్లింలను బుజ్జగిస్తే రేపు ఉత్తరాదిన అదే ముస్లింలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న తమపై తీవ్ర ప్రభావం పడుతుందనేది బీజేపీ ఆందోళన. దీంతో టీడీపీ-జనసేన మ్యానిఫెస్టోపై బీజేపీ ముద్ర కానీ, మోడీ ఫొటో కానీ లేకుండా పోయాయి.

ఇది అక్కడితో ఆగలేదు. ముస్లిం మైనారిటీ ఓట్లు గణనీయంగా ఉన్న రాజమండ్రి లోక్ సభ సీటులో పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం మ్యానిఫెస్టో విడుదలకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. కేవలం జాతీయ నేత సిద్ధార్ధ్ నాథ్ సింగ్ మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరైనా ఆయన కూడా మ్యానిఫెస్టో పట్టుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు. కేవలం ఈ మ్యానిఫెస్టోకు తమ మద్దతు ఉంటుందని మాత్రమే చెప్పి ఊరుకున్నారు.
ఇదంతా గమనిస్తే అర్ధమయ్యే విషయం ఒక్కటే. ఎన్నికల అవసరాల కోసం బీజేపీతో అయిష్టపు పొత్తు కోరుతున్న టీడీపీ-జనసేనకు ఆ పార్టీ ముస్లిం వ్యతిరేక అజెండాను నెత్తికెత్తుకునే పరిస్దితి లేదు. దీంతో తమ దారిలో తాము వెళ్లిపోతున్నాయి. బీజేపీ కూడా వారి అవసరాలకు తగినట్లుగానే వ్యవహరిస్తూ తమకూ ఇబ్బంది లేకుండా దూరంగా ఉండిపోతోంది. అంతిమంగా ఎన్నికల వేళ టీడీపీ-జనసేన ఆశించిన సాయం కూడా బీజేపీ నుంచి అందడం లేదన్నది ఇక్కడ వాస్తవం.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications