ప్రధాని మోదీ షెడ్యూల్ ఫిక్స్- టీడీపీ, జనసేనలో కొత్త టెన్షన్..!!
ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మేనిఫెస్టోల ప్రకటన తరువాత పార్టీల అధినేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. జగన్ ఓటమే లక్ష్యంగా కూటమి పార్టీల నేతలు అడుగులు వేస్తున్నారు. జగన్ తన సంక్షేమ ఓట్ బ్యాంక్ పైనే ఫోకస్ చేసారు. ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. మేనిఫెస్టో సమయంలో బీజేపీ దూరంగా ఉండటం కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో బీజేపీ నేతల ప్రచారంలో మరో కొత్త టెన్షన్ టీడీపీ, జనసేన కూటమిలో మొదలైంది.
ప్రధాని ప్రచారం
ప్రధాని మోదీ ఏపీలో ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ నెల 7,8 తేదీల్లో ప్రధాని మోదీ ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 7వ తేదీన రాజమండ్రిలో బీజేపీ అభ్యర్ది పురందేశ్వరికి మద్దతుగా మధ్నాహ్నం 3.30 గంటలకు వేమగిరిలో జరిగే సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 8న సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో ప్రధాని పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు విజయవాడలో జరిగే రోడ్ షోలో ప్రధాని పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేసారు.

పర్యటన షెడ్యూల్
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఈ మేరకు విజయవాడలో ఇప్పటికే పార్టీ నేతలు భారీగా జన సమీకరణ...రోడ్ షో సక్సెస్ పైన సమీక్ష చేసారు. మోడీతో పాటుగా చంద్రబాబు, పవన్ సభల్లో పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడించారు. ఇదే సమయంలో కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. తాజాగా కూటమి మేనిఫెస్టో ప్రకటించారు. ఈ మేనిఫెస్టో టీడీపీ, జనసేన పార్టీలదే నని చంద్రబాబు వెల్లడించారు. మేనిఫెస్టో అమలు బాధ్యత తమ రెండు పార్టీలదేనని..బీజేపీ మద్దతు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. బీజేపీకి ఈ మేనిఫెస్టోలో ప్రాతినిధ్యం లేనట్లుగా కనిపిస్తోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన కొన్ని హామీల పైన బీజేపీకి అభ్యంతరాలు ఉన్నాయని..దీని కారణంగానే దూరంగా ఉందనే ప్రచారం ఉంది.
ఆ రెండు పార్టీల్లో ఆందోళన
బీజేపీ ముఖ్య నేతల పర్యటన సమయంలో కొత్త టెన్షన్ టీడీపీ, జనసేనను వెంటాడుతోంది. ముస్లింల రిజర్వేషన్లు రద్దు గురించి బీజేపీ ముఖ్య నేతలు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఓటింగ్ పైన ప్రభావం చూపుతుందనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. మేనిఫెస్టోలో చంద్రబాబు ముస్లిం వర్గాలకు కొన్ని హామీలు ఇచ్చారు. ఇదే సమయంలో ఏపీలో బీజేపీ అగ్రనేతలు ముస్లిం రిజర్వేషన్ల గురించి వ్యాఖ్యలు చేస్తే తమకు నష్టం చేస్తుందనే భయం వెంటాడుతోంది. బీజేపీ ముఖ్య నేతలు పోటీ చేస్తున్న రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేట పార్లమెంట్ స్థానాలతో పాటుగా సుజనా చౌదరి పోటీ చేస్తున్న విజయవాడ పరిధిలో మోదీ పర్యటన ఉండేలా ప్లాన్ చేసారు.
-
బీహార్ నూతన సీఎం గా అనూహ్య ఎంపిక, నితీశ్ 'ఫిక్స్' - మోదీ మార్క్ నిర్ణయాలు..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications