వైఎస్ జగన్‌కు ప్రధాని బర్త్‌డే గ్రీటింగ్స్: మోతెక్కిపోతున్న ట్విట్టర్, ఫేస్‌బుక్

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 49వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. 1972 డిసెంబర్ 21వ తేదీన ఆయన జన్మించారు. రాష్ట్ర చరిత్రలో యంగెస్ట్ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఏపీలోనూ చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన నాయకుడు లేరు. విభజన తరువాత 13 జిల్లాలో ఏర్పాటైన ఏపీకి వైఎస్ జగన్ రెండో ముఖ్యమంత్రి.

2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకోగలిగారు. 175 స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం 151. దేశంలోనే నాలుగో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిందా పార్టీ. 22 లోక్‌సభ నియోజకవర్గాల్లో జెండా పాతారు అధికార పార్టీ అభ్యర్థులు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, డీఎంకే తరువాత లోక్‌సభలో అత్యధిక సంఖ్యలో సభ్యులు ఉన్నది వైఎస్ఆర్సీపీకే. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌తో నాలుగో స్థానాన్ని పంచుకుంటోంది.

10 సంవత్సరాల వ్యవధిలో దేశ రాజకీయాలను ఆకర్షించేలా వైసీపీ ప్రస్థానం సాగుతోంది. వైఎస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం జీవించాలని ఆకాంక్షించారు. ఏపీ, తెలంగాణ గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్, తమిళిసై సౌందరరాజన్.. ముఖ్యమంత్రి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఉపముఖ్యమంత్రులు, రాష్ట్రమంత్రులు ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి, అమ్జాద్ భాషా, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్స సత్యనారాయణ, సుచరిత వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. మరోవంక- వైఎస్ జగన్ బర్త్‌డే విషెస్‌తో సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. వైఎస్‌ఆర్సీపీ నాయకులు, అభిమానులు, సోషల్ మీడియా ప్రతినిధులు #HBDManOfMassesYSJagan అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తోన్నారు. ఈ హ్యాష్‌ట్యాగ్ మీద లక్షల ట్వీట్లు పడుతున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి ట్వీట్లు చేస్తోన్నారు.

PM Modi extend wishes to AP CM YS Jagan on his birthday

వైసీపీ సాధించిన విజయాలు, జగన్ సర్కార్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ట్వీట్లు చేస్తోన్నారు. ఫేస్‌బుక్‌లో పోస్టింగులు పెడుతున్నారు. అమ్మఒడి, నాడు-నేడు, పేదలందరికీ ఇళ్లు..వంటి పథకాలను మరోసారి గుర్తు చేస్తోన్నారు. అధికారంలోకి వచ్చిన 19 నెలల వ్యవధిలో చదువుల విప్లవాన్ని తెచ్చారని, ఒక్క విద్యారంగంపైనే 24 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారంటూ ప్రశంసిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ నిర్వహించిన పాదయాత్ర జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+