ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్‌కమ్ - రోడ్ షో లో ప్రత్యేకంగా..!!
ప్రధాని మోదీ విశాఖ కు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. విమానాశ్రయంలో గవర్నర్ తో పాటుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రత్యక వాహనం లో ప్రధాని మోదీ రోడ్ షో భారీ జనసందోహం మధ్య సాగింది. ప్రధానికి స్వాగతం పలుకుతూ పలువురు పూల వర్షం కురిపించారు. చంద్రబాబు, పవన్ రోడ్ షో లో ప్రధానితో పాటుగా ఉన్నారు. దాదాపు రెండు కిలో మీటర్ల మేర సాగిన రోడ్ షో బహిరంగ సభ జరిగే ఏయూ గ్రౌండ్స్ కు చేరుకుంది.
మూడో సారి ప్రానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారి మోదీ ఏపీకి వచ్చారు. విశాఖకు చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. చంద్రబాబు, పవన్ తో కలిసి మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రధాని మోదీ రోడ్డు షో కు, బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. చరిత్రలో గుర్తుండిపోయేలా ప్రధానికి ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించిన కూటమి నేతలు అందకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

PM @narendramodi arrived in Visakhapatnam, Andhra Pradesh a short while ago. He was received by Governor, Shri S. Abdul Nazeer, Chief Minister, Shri @ncbn, Deputy CM, Shri @PawanKalyan and other dignitaries. pic.twitter.com/2XVISLR9Vm
— PMO India (@PMOIndia) January 8, 2025
మోదీని చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతో రోడ్ షో జరిగే మార్గం రద్దీగా మారింది. బహిరంగ సభా వేదిక వద్దకు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర మంత్రులు చేరుకున్నారు. సభా వేదికగా ప్రధాని పలు కార్యక్రమాలకు శంకుస్థాపన .. ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ వేదిక నుంచే ప్రధాని పర్యటనలో అనకాపల్లి జిల్లా అచ్యు తాపురం మండలం పూడిమడకలో ఏర్పాటుచేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువే రూ.1.85లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా రహదారులు, రైల్వే పనుల అంచనా రూ.19.5 వేల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితోపాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఆరు రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు.












Click it and Unblock the Notifications