కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్.. తక్కువ వడ్డీకే లోన్లు

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన జన్మదినోత్సవం రోజే.. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ స్కీం ను ప్రారంభించారు. 18 రకాల చేతి వృత్తిదారులకు అవసరమైన పరికరాల కోసం రూ.15వేలు ఆర్థిక సహాయం అందిస్తారు. అలాగే పనిలో నైపుణ్యం మెరుగుపరుచుకునేందుకు శిక్షణ ఇవ్వడంతోపాటు రోజుకు రూ.500 ఉపకార వేతనం ఇవ్వనున్నారు. తర్వాత తక్కువ వడ్డీతో రాయితీపై బ్యాంక్ లోను వస్తుంది.

5 శాతం వడ్డీకే రుణాలు అందుతాయి. దీనికోసం కేంద్రం రూ.15వేల కోట్లు వెచ్చించనుంది. గ్రామీణ, నగర ప్రాంతాల్లోని సాంప్రదాయ చేతివృత్తుల వారిని ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. తొలివిడతగా వడ్డీపై భారీ రాయితీతో బ్యాంక్ లోన్ వస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకున్న వారికి రెండో విడతలో భాగంగా రూ. 2 లక్షల వరకు రుణం అందుతుంది. కళాకారులు తమ నైపుణ్యాలను మరింత అప్‌గ్రేడ్ చేసుకోవడం, టూల్‌కిట్ ఇన్సెంటివ్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, మార్కెటింగ్‌ను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ రుణాలను ఇస్తారు.

PM Modi Launches PM Vishwakarma Scheme
ఈ స్కీంతో ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, వడ్రంగులు, క్షురకులు, రజకులు, స్వర్ణకారులు, పడవలు తయారు చేసేవారు, ఆయుధాలు తయారు చేసేవారు, కమ్మరి, ఇనుప పరికరాలు తయారు చేసేవారు, ఇంటి తాళాలు తయారుచేసేవారు, కుమ్మరి (కుండలు తయారు చేసేవారు), విగ్రహాల తయారీదారులు, చర్మకారులు (చెప్పులు తయారుచేసేవారు), తాపీ పనిచేసేవారు (రాజ్‌మిస్త్రీ), బాస్కెట్/మ్యాట్/నారతాళ్లు తయారుచేసేవారు, సంప్రదాయ బొమ్మలు చేసేవారు, పూలదండలు తయారుచేసేవారు, దర్జీలు, చేప వలల తయారీదారులు అర్హులు. దాదాపు 30 లక్షల మంది హస్త కళాకారులు, వారి కుటుంబాలకు ఈ విశ్వకర్మ పథకంతో లబ్ధి చేకూరనుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+