మోదీ కేబినెట్ లోకి జనసేన, ఆయనకే ఛాన్స్- రామ్మోహన్ శాఖ మార్పు, ముహూర్తం ఫిక్స్..!!
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు జరుగుతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావటంతో...తదుపరి లక్ష్యం పైనా పీఎం మోదీ గురి పెట్టారు. ఏపీ నుంచి కేంద్రంలో మరో మంత్రి పదవి దక్కనుంది. జనసేనకు ఈ సారి కేబినెట్ లో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు సంకేతాలు పంపారు. జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ కేబినెట్ లో కొందరికి ఉద్వాసన పలికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని మోదీ భావిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు సహా పలువురి శాఖల మార్పు ఖాయంగా కనిపిస్తోంది.
ప్రధాని మోదీ తన కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెలాఖరులో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని తెలుస్తోంది. ప్రధాని మోదీ ఈ నెల 15 నుంచి 20 వరకు విదేశీ పర్యటనలో ఉంటారు. ఆయన స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత ఏ రోజైనా మంత్రివర్గంలో మార్పులు జరగవచ్చునని తెలుస్తోంది. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై అమిత్ షా ఇప్పటికే సూచన చేశారని సమాచారం. గత రెండేళ్లలో పదవులు నిర్వహించిన మంత్రుల పనితీరుపై మోదీ ఇప్పటికే సమీక్షించారని, ప్రస్తుత మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన తప్పదని చెబుతున్నారు. అంతేకాక ఈసారి యువ నేతలకు, మహిళలకు ప్రాధాన్యమివ్వనున్నారని అంటున్నారు. ఏపీకి మరో మంత్రి పదవి ఖాయమని సమాచారం. అందులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉండటంతో.. వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తోంది. దీంతో.. ఇప్పుడు ఏపీ నుంచి కొత్తగా కేంద్రం మంత్రి అయ్యేది ఎవరనే చర్చ మొదలైంది. ఏపీ నుంచి కేంద్రంలో టీడీపీ నుంచే ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం ఇచ్చినా.. పవన్ ఆసక్తి చూపలేదు.

ఏపీ నుంచి ఛాన్స్ దక్కేదెవరికి..!
కాగా, ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేంద్ర కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ కేబినెట్ లోనూ బీజేపీకి మరో మంత్రి పదవి పైన ప్రతిపాదన చేసినట్లు సమాచారం. కొత్తగా దక్కే మంత్రి పదవి పైన టీడీపీ, జనసేనలో ఎవరికి దక్కుతుందనేది చంద్రబాబు - పవన్ తీసుకునే తుది నిర్ణయం మేరకు ఉంటుందని తెలుస్తోంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ తాజా ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో చిత్తూరు, హిందూపూర్ ఎంపీల్లో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో సీమ నుంచి రెడ్డి వర్గానికి అవకాశం పైనా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి పేరు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా.. రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు పైన చర్చ జరుగుతోంది. రామ్మోహన్ ను విమానయానం నుంచి తప్పించి మరో కీలక శాఖ ఇస్తారని సమాచారం. దీంతో, మరో రెండు రోజుల్లో ఈ మార్పులు.. చేర్పుల పైన అధికారికంగా స్పష్టత రానుంది.













Click it and Unblock the Notifications