వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ అదే మాట.. మరి మోడీ అదే బాటేనా..? అందరూ ఫాలో కావాల్సిందే..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఇక కొన్ని సడలింపులతో క్రమంగా దేశం మళ్లీ గాడిన పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నాలుగు సార్లు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. తాజాగా సోమవారం లాక్‌డౌన్ స్ట్రాటజీపై చర్చించేందుకు ప్రధాని మోడీ మరోసారి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంను రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. ముందుగా 3 గంటలకు ప్రారంభమైన సమావేశం 5:30 గంటల వరకు సాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు మరో సెషన్ ప్రారంభం అవుతుంది.

ఇక ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫ్‌రెన్స్ ప్రారంభం కాగానే ముందుగా ఆయన మాట్లాడారు. కాసేపు ప్రధాని మాట్లాడిన తర్వాత ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఈ సారి కూడా అదే మాటలను ప్రధాని మోడీతో చెప్పారు. కరోనావైరస్‌తో కలిసి ప్రయాణించాల్సిందేనని చెప్పిన సీఎం జగన్... వ్యాక్సిన వచ్చే వరకు తప్పదని అన్నారు. ఇక కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా అత్యున్నత స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో సీఎం జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయగా పలు రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.

PM Modi Meeting with CMs: One need to learn how to live with Coronavirus says AP CM Jagan

ఇక ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో కరోనావైరస్‌ను దేశం ఎలా ఎదుర్కోవాలో మాట్లాడినట్లు సమాచారం. అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీల విషయంపై ఆలోచన చేయాలని ప్రధాని మోడీని సీఎం జగన్ కోరినట్లు సమాచారం. కరోనావైరస్ భయం వీడి దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఆ మహమ్మారిపై విజయం సాధించాలని చెప్పినట్లు సమాచారం. ఇక ఏపీలో టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచినట్లు సీఎం జగన్ ప్రధానికి వివరించారు. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావాల్సిందేనని అదే సమయంలో భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని సూచించారు సీఎం జగన్.

English summary
AP CM shared his view with PM Modi at the Chief Ministers meet. Jagan reiterated that one has to learn to live with Coronavirus until the vaccine is out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X