వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కు మోడీ సంక్రాంతి కానుక.. బందరు లడ్డూకు లైన్ క్లియర్ !

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఈ నాలుగేళ్లలో ఏమీ రాబట్టుకోలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రానికి బేషరతుగా మద్దతిస్తున్నా ఏపీని మాత్రం బీజేపీ కరుణించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి తరుణంలో వైఎస్ జగన్ సర్కార్ కు భారీ ఊరటనిస్తూ కేంద్రం సంక్రాంతి కానుకగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

జగన్ కు మోడీ సంక్రాంతి కానుక

జగన్ కు మోడీ సంక్రాంతి కానుక

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఈ ఏడాది సంక్రాంతి వేళ ప్రధాని మోడీ ప్రత్యేక కానుక ఇచ్చారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందించడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాని మోడీ.. వచ్చే ఎన్నికల్లో తిరిగి మొహం చూపించాలని కోరుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో రాష్ట్రానికి అవసరమైన ఓ కీలక అంశంలో కేంద్రం కరుణించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుతున్న ఓ అంశానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో సంక్రాంతి వేళ ప్రధాని కానుక ఇచ్చినట్లయింది.

బందరు పోర్టుకు పర్యావరణ అనుమతి

బందరు పోర్టుకు పర్యావరణ అనుమతి

ఏపీలోని కృష్ణాజిల్లాలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మచిలీపట్నం పోర్టు (బందరు పోర్టు)కు పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. మంగళగిరిలోని ఏపీ మారిటైమ్ బోర్డు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర అధికారులతో జరిపిన చర్చల్లో ఈ మేరకు అనుమతి లభించింది.
బందరు పోర్టుకు పర్యావరణ అనుమతుల మంజూరుకు సంబంధించి కేంద్ర అధికారులు అడిగిన ప్రశ్నలకు ఏపీ అధికారుల నుంచి సంతృప్తి కరమైన సమాధానాలు లభించడంతో అనుమతుల మంజూరుకు లైన్ క్లియర్ అయింది.

కేంద్రానికి జగన్ సర్కార్ థ్యాంక్స్

మచిలీపట్నం పోర్టుకు పర్యావరణ అను మతులు మంజూరు చేసేందుకు అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి భూపేంధర్‌సింగ్‌కు జగన్ సర్కార్ కృతజ్ఞతలు తెలిపింది. ప్రభుత్వం తరఫున బందరు వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ ప్రధానితో జరిపిన సమావేశాలు, బాలశౌరి పర్యావరణ మంత్రితో జరిపిన భేటీల్లో చేసిన విజ్ఞప్తులు ఫలించినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రం బృందం నవంబరు 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు పరిశీలన చేసింది. అనంతరం ఏపీ అధికారులతో మాట్లాడి ఈ అనుమతి మంజూరు చేసింది.

 త్వరలో పనులు ప్రారంభించనున్న వైఎస్ జగన్

త్వరలో పనులు ప్రారంభించనున్న వైఎస్ జగన్

బందరు పోర్టుకు పర్యావరణ అనుమతులు కూడా వచ్చేయడంతో సీఎం జగన్ చేతుల మీదుగా శంఖుస్దాపన నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పర్యావరణ అనుమతులు మం జూరు కావడంతో బందరుపోర్టు పనులను త్వరలో ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఎంపీ బాలశౌరి తెలిపారు. కృష్ణాజిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి బందరు పోర్టు దోహదపడుతుందని, వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభి స్తాయని ఎంపీ తెలిపారు. బందరు పోర్టుకు పర్యావరణ అనుమతులు రావడానికి ముఖ్యమంత్రి జగన్‌ తనవంతు కృషి చేశారని, బందరుపోర్టు నిర్మాణంలో తాను భాగస్వా మిగా ఉన్నందుకు ఆనందంగా ఉందని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు.

English summary
the union govt has granted environmental clearance to long pending machilipatnam port in ap as a sankranti gift.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X