జగన్ కు గట్టి షాక్ ఇచ్చిన మోడీ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాలనను టార్గెట్ చేసి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించిన సమయంలో జగన్ కు మోడీ మార్క్ షాక్ తగిలింది. తాజాగా బడ్జెట్ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ప్రత్యేకమైన ఫోకస్ ఉన్నట్టు నిర్మల సీతారామన్ చెప్పడంతో జగన్ ఏం చేసినా ఏపీలో ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేకత రాదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది.
నిర్మలమ్మ ప్రకటనతో జగన్ కు షాక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తాజాగా చెప్పిన శుభవార్త వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాక్ అనే చెప్పాలి. కేంద్ర బడ్జెట్ లో ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక సహాయం చేయనున్నట్టు ప్రకటించటం, ఏపీలో ప్రభుత్వ పాలన సక్సెస్ చేసేందుకు కేంద్రం తమ మద్దతు ఉంటుందని ప్రకటించడం జగన్ కు అసలు డైజెస్ట్ కాని విషయం.

జగన్ ప్లాన్ నీరు గార్చే వ్యూహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందని పేర్కొంటూ ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్ల రూపాయలను ప్రకటించటంతో పాటు అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించటం ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జగన్ వేసిన ప్లాన్ ను నీరుగార్చటమేనని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఏపీకి కేంద్రం వరాలు
లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేయటం .. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పటం చంద్రబాబుకు నిజంగా బూస్ట్ ఇచ్చిన అంశాలు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకప్యాకేజీ కింద నిధులు ఇస్తామని చెప్పడం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకారం అందిస్తామని చెప్పడం ఏపీ ప్రభుత్వానికి గొప్ప వరాలు.
ఢిల్లీ లో జగన్ ధర్నా
ఇక తాజా బడ్జెట్ ఏపీ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత తీసుకువచ్చి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్న జగన్ కు మాత్రం షాక్ అనే చెప్పాలి. రాష్ట్రంలో శాంతిభద్రతల పైన, ఏపీలో జరుగుతున్న దాడుల పైన ఢిల్లీ వేదికగా సమర శంఖం పూరించాలని భావిస్తున్న జగన్ ఢిల్లీ వేదికగా ధర్నా చేయనున్నారు.
జగన్ ప్లాన్ బూమరాంగ్
రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలనను దేశం దృష్టికి తీసుకువెళ్లాలని, రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని జగన్ భావిస్తున్న వేళ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్న నిధులకు సంబంధించి తాజా ప్రకటనలతో జగన్ ప్లాన్ బూమరాంగ్ అయినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications