అమరావతి నడిబొడ్డున - 20 అడుగుల ఎత్తులో, ఎన్నో ప్రత్యేకతలు..!!

అమరావతి కేంద్రంగా కీలక ఘట్టం చోటు చేసుకుంటోంది. ప్రధాని మోదీ ఏపీ రాజధాని పనుల రీ లాంఛ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రభుత్వం ప్రధాని సభకు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని పర్యటన వేళ అమరావతి పనుల పునర్నిర్మాణ పునర్నిర్మాణ పనుల ప్రారంభా నికి సూచికగా సుమారు 20 అడుగుల ఎత్తైన పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ పైలాన్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సభకు భారీగా హాజరయ్యే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. అట్టహాసంగా నిర్వహించేందుకు సర్వం సిద్దమైంది.

20 అడుగుల పైలాన్
అమరావతి వేదికగా ప్రధాని మోదీ లక్ష కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించను న్నారు. ఇందులో హైకోర్టు భవనం, సెక్రటేరియట్, అసెంబ్లీ, ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాలు, తదితర కీలక సౌకర్యాల నిర్ మాణం భాగంగా ఉంటుంది. మొత్తం 49,040 కోట్ల విలువైన పనులకు అమరావతిలో శంకుస్థాప నలు జరుగను న్నాయి. అమరావతి పరిధిలో మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా కేంద్రానికి చెంది న డీఆర్డీవో, డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఏఐ, రైల్వే శాఖలకు సంబంధించిన 57,962 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు.

pm-modi-to-launch-20-feet-pylon-as-amaravati-works-relaunch

A ఆకారంలో పైలాన్
అమరావతి పనుల ప్రారంభానికి గుర్తు గా 20 అడుగుల ఎత్తులో A ఆకారం లో సిద్దం చేసి పైలాన్ ను ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఇది 'A' అక్షరాకారంలో, 21 అడుగుల ఎత్తుతో, పూర్తి గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. ఇది రాజధాని పునఃనిర్మాణానికి ప్రతీకగా నిలవనుంది. అమరావతి పేరు తొలి అక్షరం 'A' రూపకల్పనకు ప్రేరణగా ఉపయోగించారు. ఈ పైలాన్ తాత్కాలికంగా కాదు, శాశ్వత గుర్తుగా మిగిలేలా నిర్మిస్తున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యంగా కృష్ణా జిల్లా నాగాయ లంకలో రూ.1500 కోట్లతో మిసైల్ టెస్ట్ రేంజ్ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇది దేశ రక్షణ రంగంలో భారీ పురోగతికి దారి తీసే అవకాశం ఉంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రధాన వేదికపై కేవలం 14 మంది ప్రముఖులకు మాత్రమే అనుమతి దక్కింది.

భారీ బందోబస్తు
భద్రతా దృష్ట్యా ఎస్‌పీజీ విభాగం వేదికను పూర్తిగా అధీనంలోకి తీసుకుంది. ప్రధాని హెలికాప్టర్లో వచ్చి, కారు మార్గంలో వేదికకు చేరుకొని అభివాదం చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి అమరావతి సభకు జన సమీకరణ చేస్తున్నారు. అందులో భాగంగా పెద్ద సంఖ్యలో హాజరుకావడానికి మూడు వేర్వేరు ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక మార్గాలు సూచించగా, వర్షం వస్తే భద్రత కోసం టెంట్లు, చైర్లు, గాలెరీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+