ఏపీలో మోడీ ప్రచారం ఖరారు-4 బహిరంగ సభలకు ప్లాన్..!
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పొత్తు ఖరారైన తర్వాత ప్రధాని మోడీ చిలకలూరిపేట సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత తిరిగి ఇటువైపు చూడలేదు. పల్నాడు సభ ముగిసి నెల రోజులు కావస్తున్నా ప్రధాని మోడీ కానీ, ఇతర బీజేపీ అగ్రనేతలు కానీ రాష్ట్రానికి రాకపోవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిలో ప్రచారం మధ్యలో ఏపీకి ప్రధాని మోడీ రాబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.
ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో వచ్చే రెండు, మూడు వారాల్లో నాలుగు బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బీజేపీ ఎంపీ అభ్యర్ధులు పోటీ చేస్తున్న సీట్లలో ఈ సభల నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. అందులోనూ ముఖ్యమైన నేతలు పోటీ చేస్తున్న సీట్లలో ప్రధాని మోడీ ప్రచారం చేయబోతున్నారు. ఆయా సభల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రధాని మోడీ పాల్గొంటారు.

ప్రధాని మోడీ రాష్ట్రంలో మొత్తం నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇందులో అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేట, మరో స్ధానంలో మోడీ ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారు. అనకాపల్లిలో బీజేపీ మాజీ ఎంపీ సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు.
రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రంగంలో ఉన్నారు. అలాగే రాజంపేటలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. కడపలోనూ బీజేపీ నేత ఆదినారాయణరెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంది. అదే జరిగితే కడప, రాజంపేట సభల్లో ప్రధాని పాల్గొనే అవకాశం ఉంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications