ఎన్నికల వేళ.. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్
IIT Tirupati, IIM Visakhapatnam: ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తోన్న రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను అంకితం చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వాటిని ప్రారంభించనున్నారు.
ఈ రెండు ప్రాజెక్టులు కూడా విద్యా రంగానికి సంబంధించినవే. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు చెందినవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటి వల్ల ఈ రెండు ప్రాంతాలు కూడా ఎడ్యుకేషనల్ హబ్‌గా గుర్తింపు పొందుతాయనడంలో సందేహాలు అక్కర్లేదు.

ఈ రెండింట్లో ఒకటి.. తిరుపతి సమీపంలో నిర్మితమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రెండు- విశాఖపట్నం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్. ఐఐటీ-తిరుపతి, ఐఐఎం విశాఖపట్నంలను ఈ నెల 20వ తేదీన ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ప్రారంభించనున్నారు.
వీటితో పాటు దేశవ్యాప్తంగా పలు ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్, ఐఐఐటీడీఎం, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలను ప్రధాని ప్రారంభిస్తారు. ఐఐటీ- భిలాయ్, ఐఐటీ- జమ్మూ, ఐఐఐటీడీఎం- కాంచీపురం పూర్తిస్థాయి క్యాంపస్‌ను మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
వాటన్నింటితో పాటు ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్, ఉత్తరాఖండ్‌లోని దేవప్రయాగ, అగర్తలలో నిర్మించిన సెంట్రల్ సంస్కృత యూనివర్శిటీని మోదీ క్యాంపస్‌ను కూడా ఆయన అందుబాటులోకి తీసుకుని రానున్నారు. వాటన్నింటి విలువ సుమారు 13,375 కోట్ల రూపాయలు.












Click it and Unblock the Notifications