అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ ప్రజలు పట్టుదలకు మారు పేరు- తెలుగులో ప్రధాని శుభాకాంక్షలు : గవర్నర్ - సీఎం సైతం...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ప్రధాని ట్విట్టర్ వేదికగా తన సందేశం ఇచ్చారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవం టీడీపీ ప్రభుత్వం నిర్వహించ లేదు. రాష్ట్ర విభజన అప్పాయింటెడ్ డే జూన్ 2న ప్రతీ ఏటా తెలంగాణ రాష్ట్రం అక్కడ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తాను ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 8వ తేదీని ప్రతీ ఏటా నవ నిర్మాణ దీక్షల పేరుతో వారం పాటు కార్యక్రమాలు నిర్వహించే వారు.

టీడీపీ హయాంలో నవనిర్మాణ దీక్షలు

టీడీపీ హయాంలో నవనిర్మాణ దీక్షలు

దీంతో..అసలు ఏపీకి అవతరణ దినోత్సవం అంటూ లేదా అనే చర్చ సాగింది. సమైక్య రాష్ట్రంలో నిర్వహించిన విధంగానే ప్రతీ ఏటా నవంబర్ 1వ తేదీనే రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించాలని పలువురు డిమాండ్ చేసారు. ఇక, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తిరిగి నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించారు. దీంతో..ఈ రోజున ప్రధాని ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ తెలుగులో ట్వీట్ లో చేసారు.

నైపుణ్యానికి మారు పేరంటూ ప్రధాని శుభాకాంక్షలు

అందులో.. " ఏపీ ప్రజలు నైపుణ్యం, ధృడ సంకల్పం, పట్టుదలకు మారుపేరని కొనియాడారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందిస్తూ..'ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నానని.."" ట్వీట్‌ చేశారు. గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సైతం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Recommended Video

Anthrax కలకలం... కరోనా లా ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అవకాశం | Telangana || Oneindia Telugu
ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు

ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు


పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం కొనసాగించడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం తెలుగుతల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఇక, ఇదే రోజున పలు రంగాల్లో ప్రతిభ చాటిన వారికి ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్.. వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులు ప్రధానం చేయనుంది. గవర్నర్..సీఎం ఈ అవార్డులకు ఎంపికైన వారిని సత్కరించి వారిని నగదు- ప్రశంసా పత్రాలు అందచేస్తారు.

English summary
AP Govt celebrating state formation day with YSR life time achievement awards. PM Modi wishes to AP people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X