వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాత్రూంలో రెయిన్‌కోట్ వేసుకొని స్నానం చేసినట్లు..: మన్మోహన్‌పై మోడీ

రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పైన బుధవారం నాడు సెటైర్లు వేశారు. ఆయన వ్యవహారం బాత్ రూంలో రెయిన్ కోట్ వేసుకొని స్నానం చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పైన బుధవారం నాడు సెటైర్లు వేశారు. ఆయన వ్యవహారం బాత్ రూంలో రెయిన్ కోట్ వేసుకొని స్నానం చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.

నోట్ల రద్దు.. వారికి చివరి అవకాశం: మోడీ, రాజీవ్ గాంధీ తెస్తే ఎక్కడున్నాయి?నోట్ల రద్దు.. వారికి చివరి అవకాశం: మోడీ, రాజీవ్ గాంధీ తెస్తే ఎక్కడున్నాయి?

అవినీతి పైన పోరాటంలో రాజకీయాలు లేవని చెప్పారు. నోట్ల రద్దును ప్రజలు సమర్థించారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు సత్ఫలితాలు ఇస్తుందని చెప్పారు. నోట్ల రద్దు తర్వాత 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు.

భారత ఆర్థిక వ్యవస్థను నల్లధనం చిన్నాభిన్నం చేసిందన్నారు. అవినీతి విషయంలో రాజకీయం చేయడం సరికాదన్నారు. 1971లో నోట్ల రద్దు ప్రతిపాదనను ఇందిరా గాంధీ వ్యతిరేకించారని చెప్పారు. డిజిటల్ విధానాన్ని మరింత ప్రోత్సహించాలన్నారు.

modi, manmohan

ఆర్బీఐ గవర్నర్ మీద విమర్శలు సరికాదని మోడీ చెప్పారు. రఘురాం రాజన్ మీద విమర్శలు వచ్చినప్పుడు కూడా తాను ఇదే చెప్పానని అన్నారు. ఆర్బీఐ గౌరవం నిలబెట్టేందుకు మనం ప్రయత్నించాలన్నారు. ఆర్బీఐకి తాము పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని చెప్పారు.

ఆర్బీఐ వ్యవహారాల్లో చిదంబరం జోక్యం చేసుకుంటున్నారని నాడు సుబ్బారావు లేఖ రాశారన్నారు. తాము మాత్రం జోక్యం చేసుకోమని చెప్పారు. రైల్వేలో 60 శాతం నుంచి 70 శ శాతం వరకు టిక్కెట్లు ఆన్ లైన్ ద్వారా తీసుకుంటున్నారని చెప్పారు.

21 కోట్ల మందికి రూపే కార్డులు ఇచ్చామని చెప్పారు. చంద్రబాబు కమిటీ ఇచ్చిన రిపోర్టును అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. రూపే కార్డులు కలిగి ఉండటం ఇప్పుడు ఓ స్టేటస్‌గా మారిందన్నారు.

బాత్ రూంలో రెయిన్ కోట్ వేసుకొని స్నానం చేసినట్లు..

మన్మోహన్ సింగ్ వ్యవహారం బాత్ రూంలో రెయిన్ కోట్ వేసుకొని స్నానం చేసినట్లుగా ఉందన్నారు. 35 ఏళ్ల పాటు దేశ ఆర్థిక వ్యవస్థ మీద మన్మోహన్ ప్రభావం ఉందని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వం ఒక వైపు ఉంటే కొన్ని పార్టీలు, కొందరు నేతలు మరోవైపు ఉన్నారన్నారు. అంతకుముందు మోడీ ప్రసంగంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసింది.

English summary
Prime Minister Narendra Modi today said in Rajya Sabha that the war against black money and corruption is not against any political party and there is no reason for anyone to dissociate from it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X