వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీకి గట్టి షాక్: ఎంపీలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని మోడీ, ఏం చేద్దాం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి/న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ గట్టి షాకిచ్చారు! కడప స్టీల్ ప్లాంట్, విభజన హామీల అంశాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఏపీ టీడీపీ ఎంపీలుప్రధాని అపాయింటుమెంట్ కోరారు. కానీ ప్రధానమంత్రి కార్యాలయం నిరాకరించింది.

Recommended Video

అడిగిందే అడుగుతారా, నేను లేఖ రాస్తా..చంద్రబాబు

ఢిల్లీలో పోరాడుతాం: జేసీ, అడిగిందే అడుగుతారా.. నా లేఖ ఇవ్వండి: బాబుఢిల్లీలో పోరాడుతాం: జేసీ, అడిగిందే అడుగుతారా.. నా లేఖ ఇవ్వండి: బాబు

మోడీ భేటీ నిరాకరణ.. ఏపీ భవన్లో భేటీ

మోడీ భేటీ నిరాకరణ.. ఏపీ భవన్లో భేటీ

కడపలో స్టీల్ ప్లాంట్ కోసం రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ చేస్తున్న ఆమరణదీక్ష గురించి కూడా ప్రధాని మోడీని కలిసి వివరించాలని వారు భావించారు. కానీ వారికి నిరాశ ఎదురైంది. ప్రధాని మోడీ తమకు అపాయింటుమెంట్ నిరాకరించిన నేపథ్యంలో వారు ఏపీ భవన్లో భేటీ అయ్యారు.

భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

ఏఫీ భవన్‌లో భేటీ అయిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఎలా ముందుకు వెళ్దామనే అంశంపై వారు చర్చించుకున్నారు. అవసరమైతే ఢిల్లీలో దీక్షపై ఇప్పటికే అనంతపురం ఎంపీ జేసి దీవాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

కేంద్రమంత్రిని కలిసి చంద్రబాబు లేఖ

కేంద్రమంత్రిని కలిసి చంద్రబాబు లేఖ

ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ను గురువారం మరోసారి కలవనున్నారు. బుధవారం కలిసినప్పుడు ఆయన నుంచి వారికి సానుకూల స్పందన రాలేదు. దీంతో వారు మరోసారి ఆయనతో భేటీ అయి, ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖను ఇస్తారు.

క్షీణిస్తున్న సీఎం రమేష్ ఆరోగ్యం

క్షీణిస్తున్న సీఎం రమేష్ ఆరోగ్యం

ఇదిలా ఉండగా, కడప స్టీల్ ప్లాంట్ కోసం సీఎం రమేష్ చేస్తున్న దీక్ష గురువారం తొమ్మిదవ రోజుకు చేరుకుంది. షుగర్ లెవెల్స్ పడిపోతుండటంతో ఆయన ఆరోగ్యం విషమిస్తోంది. మరో టీడీపీ నేత బీటెక్ రవి ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం సాయంత్రం అతనిని ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. చంద్రబాబు రెండ్రోజుల్లో కడపకు రానున్నారు.

English summary
Prime Minister Narendra Modi rejected appoinment to Telugudesam Party MPs on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X