ఓ వైపు చంద్రబాబు దీక్ష.. మరో వైపు మోడీ ట్వీట్ ఆసక్తికరం
న్యూఢిల్లీ: కేంద్రం తమ రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక రోజు నిరాహార దీక్ష చేస్తుంటే.. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 20నే చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మోడీ ట్వీట్ చేశారు.
'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నా' అని ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

చివరి కేంద్ర బడ్జెట్‌లోనూ తమ రాష్ట్రానికి న్యాయం చేయలేదంటూ ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కూడా బీజేపీతో ఇక పొత్తు ఉండదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో 'ధర్మ పోరాట దీక్ష' పేరుతో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఈ దీక్ష కొనసాగిస్తారు.
-
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications