తొందరపడొద్దు, మాట్లాడుకుందాం రా: మోడీ, బావోద్వేగం మేరకు నిర్ణయం: బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:కేంద్ర మంత్రివర్గం నుండి బయటకు రాకూడదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ప్రధానమంత్రి మోడీ కోరారు. తొందరపడకూడదని, కూర్చొని మాట్లాడుకుందామని మోడీ ప్రతిపాదించారు. కానీ, కేంద్రం నుండి వైదొలగాలనే నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టు చంద్రబాబునాయుడు మోడీకి వివరించారు.

  Modi's Reaction on Ashok Gajapathi Raju, Sujana Chowdary's resign

  బాబు ఎఫెక్ట్: కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ ఎవరికీ, అదృష్టవంతులు వీరేనా?

  కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగాలని టిడిపి బుధవారం నాడు రాత్రి నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం మేరకు గురువారం సాయంత్రం కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, ఆశోక్ గజపతిరాజులు మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించారు.

  ఏపీకి అండగా ఉంటా:మోడీ, రాజీనామాలకు కారణమిదే: సుజనా, ఆశోక్

  ఈ రాజీనామాలు గురువారం రాత్రి ఆమోదం పొందాయి,ఏపీ రాష్ట్రం పట్ల కేంద్రం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్న తీరుపై టిడిపి తీవ్ర అసంతృప్తితో ఉంది.దీంతో కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకొంది.

  రంగంలోకి అమిత్ షా: ఏపీ పరిణామాలపై ఆరా, ఆ ఫోన్ తర్వాతే రాజీనామా

  మాట్లాడుకుందామని పిలిచిన మోడీ

  మాట్లాడుకుందామని పిలిచిన మోడీ

  కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగడానికి కొద్ది గంటల ముందే ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ప్రధానమంత్రి మోడీ ఫోన్ చేశారు. కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలిగే విషయంలో తొందరపడకూదని చంద్రబాబునాయుడును కోరారు. ఏపీ రాష్ట్రానికి ఏం కావాలనే విషయమై కూర్చొని మాట్లాడుకుందామని బాబుకు మోడీ సూచించారు. అయితే మోడీ ప్రతిపాదనకు బాబు సున్నితంగా తిరస్కరించారు.

  ఏపీకి న్యాయం చేసేందుకు సిద్దం

  ఏపీకి న్యాయం చేసేందుకు సిద్దం


  ఏపీ రాష్ట్రానికి న్యాయం చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో చర్చించిన సమయంలో బాబుకు ప్రధానమంత్రి మోడీ హమీ ఇచ్చారని టిడిపి వర్గాలు తెలిపాయి. మోడీ ఫోన్ చేసిన కొద్ది క్షణాలకే మంత్రి పదవులకు ఆశోక్ గజపతి రాజు, సుజానా చౌదరిలు రాజీనామాలు చేశారు.

  ప్రజల బావోద్వేగం మేరకు నిర్ణయం

  ప్రజల బావోద్వేగం మేరకు నిర్ణయం

  ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి మోడీ దృష్టికి తెచ్చారు. ప్రజల భావోద్వేగం, ఏపీ అవసరాల దృష్ట్యా రాజీనామాల నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి వర్గం నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకొంటున్నట్టు చంద్రబాబునాయుడు మోడీ దృష్టికి తెచ్చారు.

  మంత్రులతో బాబు అత్యవసర సమావేశం

  మంత్రులతో బాబు అత్యవసర సమావేశం

  ప్రధానమంత్రి మోడీతో ఫోన్ సంభాషణ వివరాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మంత్రులకు వివరించారు. మోడీ ఫోన్ సంభాషణపై చంద్రబాబునాయుడు మంత్రులకు గురువారం రాత్రి చెప్పారు. ప్రజాభిప్రాయం, ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న విషయాన్ని ప్రధానికి తెలిపాను. విభజన చట్టాన్ని అమలు చేయాలని నాలుగేళ్లుగా కోరుతున్నామని హోదా అంశం ఏపీలో సెంటిమెంట్‌గా మారిందని మోదీకి మరోసారి చెప్పానని మంత్రులకు బాబు వివరించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Telugu Desam Party's two ministers in the central government met Prime Minister Narendra Modi on Thursday evening and handed him their resignation.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి