HBD YSJagan ప్రధాని మోదీ - ప్రముఖుల విషెస్ : సోషల్ మీడియా షేకింగ్..!!

HBD YSJagan:ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రధాని మోదీ విషెస్ చెప్పారు. సీఎం జగన్ జన్మదినం కావటంతో ప్రధాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ఆరోగ్యంగా ఉండాలని ఆకాక్షించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సీఎం జగన్ ను శుభాకాంక్షలు చెప్పారు. సంతోషంగా జీవించాలని ఆకాక్షించారు. అదే విధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సీఎంకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసారు. హీరో నాగార్జున ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి జన్మదినం కావటంతో ఆయన అభిమానులు..వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్త దానం.. సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ముఖ్యమంత్రిని వేద పండితులు ఆశీర్వదించారు. ఇక, సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి జగన్ విషెస్ హోరెత్తుతున్నాయి. #HBD YSJagan టాగ్ లో ట్విట్టర్ హోరెత్తుతోంది.

PMModi and other leaders extended birthday wishes to CM Jagan, who turned 50.

ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా ట్వీట్లు కనిపిస్తున్నాయి. ఇక, పార్టీ నేతలు నియోజవర్గాల్లో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ బాపట్ల చేరుకున్నారు. అక్కడ 8వ తరగతి విద్యార్ధులకు ఉచిత ట్యాబ్ లు పంపిణీ సీఎం ప్రారంభించనున్నారు. బైజూస్ కంటెంట్ తో పాటుగా ఈ టాబ్ లను అందిస్తున్నారు.

పార్టీ ప్రధాన కార్యాలయంలో సీఎం జన్మదిన వేడకలు నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల సెలబ్రేషన్స్ ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా జగన్ తాను చేసింది ప్రజలకు వివరిస్తూ..తాను చేసిన మంచి నచ్చితేనే ఓట్లు వేయమని ధైర్యం చెప్పగలిగిన నేతగా అభివర్ణించారు. జగన్ చిరస్థాయిగా నిలిచిపోవాలని సజ్జల ఆకాంక్షించారు. ప్రత్యేకంగా వెబ్ సైట్ ద్వారా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ప్రారంభించారు. అదే విధంగా పలు జిల్లాల్లో మూడు రోజులుగా వైఎస్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సేవా కార్యక్రమాలతో పాటుగా పోటీలు నిర్వహించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+