మోడీ కోర్టులోకి వైసీపీ ఎంపీల పోరు-గోరంట్ల మాధవ్ పై రఘురామ ఫిర్యాదు-స్పందించిన పీఎంవో
ఏపీలో వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగుతున్న పోరులో మరో అంకానికి తెరలేచింది. ఇప్పటివరకూ వైసీపీ అధినేత జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శల పర్వం సాగిస్తున్న రఘురామకు ఇప్పుడు మరో ప్రత్యర్ధి తోడయ్యారు. తాజాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్ సభలో తనకు వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ లక్ష్యంగా రఘురామకృష్ణంరాజు పోరు ప్రారంభించారు. ఈ మేరకు మాధవ్ పై రఘురామ ఇచ్చిన ఫిర్యాదు ప్రధాని కార్యాలయానికి చేరింది.

వైసీపీ వర్సెస్ రఘురామ పోరు
వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీపైనే నిత్యం యుద్ధం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం నానాటికీ ముదురుతోంది. ఇప్పటికే పార్టీ అధినేత జగన్ తో పాటు విజయసాయిరెడ్డిపై పోరాటం చేస్తున్న రఘురామరాజు క్రమంగా పార్టీలో మిగతా నేతలపైనా దృష్టిపెడుతున్నారు. ఇదే క్రమంలో పార్టీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయనకు తోడయ్యారు. దీంతో తాజాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్ సభలో ఆయనతో సాగిన వాగ్యుద్ధం రఘురామరాజుకు కలిసివస్తోంది. దీంతో ఈ వ్యవహారాన్ని వాడుకుని వైసీపీని మరింత బదనాం చేసేందుకు రఘురామ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

రఘురామకు గోరంట్ల మాధవ్ వార్నింగ్
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపై నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి విరుచుకుపడుతున్న రఘురామకృష్ణంరాజును లక్ష్యంగా చేసుకుని ఈ నెల 3వ తేదీన లోక్ సభలో వార్నింగ్ ఇచ్చారు. వైసీపీపై ప్రెస్ మీట్లు పెడితే అంతం చేస్తానంటూ మాధవ్ తనను బెదిరించారంటూ రఘురామరాజు లోక్ సభ స్పీకర్ తో పాటు ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. మరోసారి టీవీల్లో కనిపిస్తే చంపేస్తానంటూ ఆయన బెదిరించినట్లు పేర్కొన్నారు. ఇదే విషయంపై ప్రధాని కార్యాలయానికి రఘురామకృష్ణంరాజు అదే రోజు లేఖ కూడా రాశారు. ఆ తర్వాత ఈ నెల 4వ తేదీన మరిన్ని ఆధారాలతో మరో లేఖ కూడా రాశారు. రఘురామరాజు రాసిన ఈ రెండు లేఖలతో గోరంట్ల మాధవ్ పేరు పార్లమెంటు వర్గాల్లో ప్రస్తుతం వినిపిస్తోంది.

రఘురామ లేఖపై స్పందించిన ప్రధాని
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ లోక్ సభ సాక్షిగా తనను దుర్భాషలాడారంటూ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదు ప్రధాని కార్యాలయానికి చేరింది. ఈ మేరకు గోరంట్ల మాధవ్ పై ఫిర్యాదు చేస్తూ రఘురామరాజు రాసిన రెండు లేఖలు తనకు చేరినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా నిర్దారించారు. తాజాగా ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ప్రధాని మోడీ స్వయంగా సంతకం చేసిన లేఖ రఘురామరాజుకు అందింది. దీంతో రఘురామ రాజు ఆనందంలో మునిగిపోతున్నారు. ప్రధాని మోడీ తన స్పందన ద్వారా రఘురామ ఫిర్యాదు తమ పరిశీలనలోనే ఉన్నట్లు స్వయంగా చెప్పినట్లయింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన స్పందనతో ఢిల్లీలో వైసీపీ ఎంపీల కంటే రెబెల్ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజుకు ఉన్న పరపతి మరోసారి స్పష్టమైనట్లయింది.

రఘురామ ఫిర్యాదుపై ప్రధాని జోక్యం ?
వైసీపీ రెబెల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు స్వయంగా తన పార్టీకి చెందిన ఎంపీపైనే చేసిన ఫిర్యాదుపై ప్రధాని మోడీ స్పందించాల్సిన అవసరం లేదు. కానీ ప్రధాని మోడీ స్వయంగా ఈ ఫిర్యాదు తమకు అందిందని నిర్ధారిస్తూ రఘురామకు లేఖ పంపారు. దీంతో ఇప్పుడు రఘురామ రాజు చేసిన ఫిర్యాదుపై మోడీ ఎలా స్పందించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

లోక్ సభ స్పీకర్ కే పంపుతారా ?
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై రెబెల్ ఎంపీ రఘురామరాజు చేసిన ఫిర్యాదు తమకు అందిందని సమాచారం ఇచ్చిన ప్రధాని మోడీ.. ఇప్పుడు దాన్ని ఏం చేయబోతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లోక్ సభలోనే జరిగిన ఘటన కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ కే రఘురామరాజు ఫిర్యాదు లేఖలు పంపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి లోక్ సభలో సభ్యుల మధ్య చోటు చేసుకునే గొడవలు సభా హక్కుల కమిటీతో పాటు ఎధిక్స్ కమిటీకి వెళతాయి. అప్పుడు ఫిర్యాదు, ఘటనల తీవ్రత ఆధారంగా ఆయా కమిటీలు నిర్ణయం తీసుకుంటాయి. దీంతో ఇప్పుడు రఘురామ రాజు ప్రధానికి చేసిన ఫిర్యాదు లోక్ సభ స్పీకర్ కు చేరితే ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయో అన్న ఉత్కంఠ నెలకొంది.

రఘురామకు మరో విజయం
ఇప్పటికే వైసీపీతో విభేదిస్తూ ఆ పార్టీ నేతలపై కేంద్రానికి వరుస ఫిర్యాదులు చేస్తున్న రఘురామకృష్ణంరాజు దాదాపు ప్రతీ విషయంలోనూ అనుకున్న ఫలితాన్ని రాబడుతున్నారు. ఇదే క్రమంలో తనను లోక్ సభలోనే బెదిరించేలా గోరంట్ల మాధవ్ వ్యవహరించడంపైనా లోక్ సభ స్పీకర్ తో పాటు ప్రధానికీ ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణంరాజు ఈసారి కూడా గెలిచారు. ప్రధాని మోడీ స్పయంగా రఘురామరాజు రాసిన లేఖకు స్పందించడాన్ని బట్టి చూస్తుంటే వైసీపీ ఎంపీల కంటే రఘురామరాజుకే ప్రధాని మోడీ వద్ద కూడా పరపతి పెరుగుతున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే రఘురామరాజుపై అనర్హత కోరుతూ లోక్ సభ స్పీకర్ కు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఆయన లేఖకు స్పందించడం ఆసక్తి కరంగా మారింది. దీనిపై లోక్ సభ స్పీకర్ కూడా స్పందిస్తే మాత్రం మాధవ్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications