రేపు తెలంగాణ బంద్, మినహాయింపు. శాపమని ఈటెల

తెలంగాణ బందుకు రాజకీయ పార్టీల మద్దతు
టీజేఏసీతో పాటు సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా తెలంగాణ బందుకు పిలుపునిచ్చాయి. ఈ బందుకు తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ మద్దతు ఇచ్చింది. కాగా, బోనాల పండుగ నేపథ్యంలో సికిందరాబాద్ జోన్‌ను బంద్ నుండి మినహాయించింది.
శాపంగా మారుతుంది: ఈటెల
పోలవరం బిల్లు కేంద్ర ప్రభుత్వానికి శాపంగా మారనుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో అన్నారు. ముంపు ప్రాంతాలను తెలంగాణ రాష్ట్రంలో ఉంచేందుకు తాము ఉద్యమిస్తామని చెప్పారు.
దురదృష్టకరం: పొన్నాల
పోలవరం బిల్లు తొందరపాటు చర్య అని, దురదృష్టకరమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. రేపటి బందుకు తాము మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
అడ్డుకుంటాం: పోచారం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపకుండా అడ్డకుంటామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేంద్రం ఏకపక్షంగా పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిందని మండిపడ్డారు. రాష్ట్రపతి అడ్డుకోని పక్షంలో న్యాయపోరాటానికి వెనుకాడబోమన్నారు.












Click it and Unblock the Notifications