వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం కల: బాబు, ముంపు ప్రాంతాలకు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు కేఎల్ రావు కల అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. పోలవరం ముంపు ప్రాంత ప్రజలకు తాము న్యాయం చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఏ ఒక్కరికీ నష్టం లేదన్నారు. హైదరాబాదులోని అమీర్ పేటలో నిర్వహించిన ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొని, మాట్లాడారు.

ఇక నుంచి కేఎల్ రావు జయంతిని ఇంజినీర్ల దినోత్సవంగా నిర్వహిస్తామన్నారు. అవినీతిని కేఎల్ రావు ఉపేక్షించేవారు కాదన్నారు. నదుల అనుసంధానంపై ఆయన ఆలోచనలు పలుమార్లు తెర పైకి వచ్చాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కరవును పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉందన్నారు.

వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కరవు నిర్మూలనపై ఇంజినీర్లు తమ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవాలని కోరారు. వచ్చే ఐదేళ్లలో ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయితే కరువు ఉండక పోయేదన్నారు.

గంగా, కావేరీ నదులు కలవాలని కేఎల్ రావు నాడే కోరుకున్నారని చెప్పారు. సముద్ర నీటిని శుద్ధి చేసి తాగునీటికి ఉపయోగించే ప్రక్రియను చేపడతామన్నారు. కేఎల్ రావు జయంతిని ఇంజినీర్ల దినోత్సవంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి రైతుల అభివృద్ధికి కృషి చేసిన కేఎల్ రావు ఆశయాలను యువ ఇంజనీర్లు కొనసాగించాలన్నారు. కేఎల్ రావు కలలుగన్న పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

కేఎల్‌ రావు 112వ జయంతి సందర్భంగా అమీర్‌పేటలోని కమ్మ సంఘంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన

జ్యోతి ప్రజ్వలన

కేఎల్‌ రావు 112వ జయంతి సందర్భంగా అమీర్‌పేటలోని కమ్మ సంఘంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేస్తున్న చంద్రబాబు.

చంద్రబాబు

చంద్రబాబు

కేఎల్ రావుకు నివాళులు అర్పించిన చంద్రబాబు... ఆయన భావితరాలకు ఆదర్శప్రాయుడని కొనియాడారు. నీటిపారుదల శాఖ గురించి చెబితే మొదట గుర్తు వచ్చే వ్యక్తి కేఎల్ రావు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

కేఎల్ రావుకు నివాళులు అర్పించిన చంద్రబాబు... ఆయన జయంతిని ఇంజనీర్ల దినోత్సవంగా నిర్వహిస్తామని చెప్పారు. నదుల అనుసంధానంపై కేఎల్ రావు ఆలోచనలు ఎన్నోసార్లు తెర పైకి వచ్చాయన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

కేఎల్ రావు అవినీతిని ఉపేక్షించేవారు కాదని, నీటి కోసం అనేక గొడవలు జరుగుతున్నాయని, వీటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.

సన్మానం

సన్మానం

కేఎల్‌ రావు 112వ జయంతి సందర్భంగా అమీర్‌పేటలోని కమ్మ సంఘంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. బాబు, దేవినేనిలు సన్మానిస్తున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

కేఎల్‌ రావు 112వ జయంతి సందర్భంగా అమీర్‌పేటలోని కమ్మ సంఘంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu said Polavaram project KL Rao's dream.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X