విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలవరం ముంపు మండలాల పరిపాలన పూర్తి స్ధాయిలో ఏపీ చేతిలోకి...

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల పరిపాలనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక పూర్తి స్థాయిలో నిర్వహించనుంది. ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లో విలీనం చేసిన ప్రాంతంలో ఇకనుంచి వారి అడ్మినిస్ట్రేషన్ కొనసాగనుంది.

ఈ మేరకు శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ నిర్ణయం తీసుకున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లతో ఈ విషయమై చర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

Polavaram Mumpu Mandalalu taken by Andhra pradesh

ఆయా మండలాల్లో పనిచేస్తున్న అన్నిశాఖల ఉద్యోగులకు డిసెంబర్ నెలనుంచి వేతనాలను తామే ఇస్తామని పేర్కొన్నారు. క్రిమినల్ కోడ్ నేర శిక్షాస్మృతి పరిధిని ఖరారు చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్‌ను వెలువరిస్తామని అన్నారు.

విలీనమైన మండలాల పాలన కోసం భద్రాచలం పక్కనున్న ఎటపాకలో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎస్ ప్రకటించారు. భద్రాచలం డివిజన్‌కు చెందిన పోలవరం ముంపు మండలాలు చింతూరు, కూనవరం, నెల్లిపాక, వరారామంచంద్రాపురంలు ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన విషయం తెలిసిందే.

English summary
Saturday onwards Polavaram Mumpu Mandalalu taken by Andhra pradesh. Andhra Pradesh gocernmnet pay the salaries for those mandalal govt employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X