ఝలక్: 'పోలవరం వద్ద వాటిని ఆపండి, అవసరమో కాదో మేమే తేల్చుతాం'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించవద్దని కేంద్ర జలవనరుల శాఖ ఏపీకి లేఖ రాసింది. ఈ డ్యాం నిర్మించడం అవసరమా లేదా అన్నది తేల్చాలని, ఇందుకు ఓ కమిటీ వేస్తామని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

ప్యారడైజ్‌లో జగన్ పేరు ఇలా, టీడీపీ నేతల విమర్శలు

 పరిశీలన కోసం కమిటీ వేయాలని సూచన

పరిశీలన కోసం కమిటీ వేయాలని సూచన

పరిశీలన కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్‍‌పీసీకి కేంద్రం సూచించింది. ఆ కమిటీ పోలవరం ప్రాజెక్టును సందర్శించి అధ్యనయం చేసి నివేదిక ఇచ్చిన తర్వాత కాఫర్ డ్యాంపై నిర్ణయం తీసుకోనున్నారు. అప్పటి దాకా పనులు చేపట్టవద్దని తెలిపింది.

 ఇబ్బంది కలగకుండా కాఫర్ డ్యాంలు

ఇబ్బంది కలగకుండా కాఫర్ డ్యాంలు

కాఫర్‌ డ్యాం అవసరం లేకుండానే ప్రధాన డ్యాం నిర్మాణం చేపట్టవచ్చని జలవనరుల శాఖ భావిస్తోంది. ప్రధాన డ్యాం 45 మీటర్లకు పైగా ఉంటుంది. దీని నిర్మాణానికి ముందే ఆ పనులకు ఇబ్బంది కలగకుండా ఎగువన, దిగువన కాఫర్‌ డ్యాంలు రెండు నిర్మించాల్సి ఉంది.

 కాఫర్ డ్యాం అంటే

కాఫర్ డ్యాం అంటే

ఏదైనా ప్రాజెక్టులో మెయిన్ డ్యాం నిర్మాణానికి ముందే ఎగువన, దిగువన కాఫర్ డ్యాంలు నిర్మిస్తారు. వరద నీటిని వాటి ద్వారా మళ్లించి పనులు సులభంగా, త్వరగా అయ్యేలా చేస్తారు.

 ఆరు నెలల క్రితం శుంకుస్థాపన

ఆరు నెలల క్రితం శుంకుస్థాపన

కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టులో కీలక ఘటమటమైన కాఫర్ డ్యాం పనులకు ఆరు నెలల క్రితం శంకుస్థాపన చేశారు. టాప్ లేవల్ కాఫర్ డ్యాం 42 మీటర్లు, దిగువది అంతకన్నా తక్కువ ఎత్తు ఉండేలా నివేదిక సిద్ధం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Andhra Pradesh received a letter from Centre on Polavaram Project cofferdam issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి