• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం జగన్ మాట నెగ్గేనా..రివర్స్ అయ్యేనా: సమాధానం ఇచ్చిన నవయుగ: నేడు తేల్చేస్తారు..!

|
  పోలవరం భవితవ్యం ఏంటి ? || PPA To Take Decison On AP Govt Proposal Of Reverse Tendering || Oneindia

  పోలవరం భవతవ్యం ఏంటో మరి కొద్ది సేపట్లో తేలి పోనుంది. పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌పై కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం పచ్చ జెండా ఊపుతాయా లేదా అనే సందేహాలకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) క్లారిటీ ఇవ్వనుంది. పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులు చేపడుతున్న నవయుగ ఇంజనీరింగ్‌, బెకమ్‌ సంస్థలకు ముం దస్తుగా కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా చేసిన పనుల లావాదేవీలు సెటిల్‌ చేసుకోవాల్సిందిగా ప్రీ క్లోజర్‌ ఆ కంపెనీలకు ఇచ్చిన నోటీసులో పోలవరం సాగునీటి ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీరు సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. ఈ నోటీసుకు నవయుగ ఇంజనీరింగ్‌, బెకమ్‌ సంస్థల నుంచి సమాధానాలు వచ్చాయి. సీఎం జగన్ ప్రతిపాదిస్తున్న రివర్స్ టెండరింగ్ పైనా కీలక నిర్ణయం వెలువడనుంది.

  పోలవరం భవితవ్యం తేలి పోనుంది...

  పోలవరం భవితవ్యం తేలి పోనుంది...

  పోలవరం ప్రాజెక్టు భవితవ్యం పైన కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే పోలవరం పైన రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం కాంట్రాక్టు కంపెనీలుగా ఉన్న నవయుగ ఇంజనీరింగ్‌, బెకమ్‌ సంస్థలకు ముం దస్తుగా కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని పైన ఆ సంస్థలు సమాధానలు ఇచ్చాయి. జగన్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌పై కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం పచ్చ జెండా ఊపుతాయా లేదా అనే సందేహాలకు సమాధానం దొరకనుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన కేంద్ర మంత్రి లోక్ సభలో కీలక వ్యాఖ్యలు చేసారు. షెకావత్‌.. కొత్తగా టెండర్లు పిలవడం వల్ల కాలాతీతమవుతుందనీ, ధరలూ పె రుగుతాయని, పోలవరం భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీని కలిసిన సమయంలో పోలవరం పైన చర్చ చేసారు. ప్రధానికి పరిస్థితిని వివరించారు. దీంతో..ఈ రోజు పీపీఏ కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పైన కీలక నిర్ణయం తో పాటుగా ఏపీ ప్రభుత్వానికి దిశా నిర్ధేశం చేయనుంది.

  పీపీఏ ముందుకు రివర్స్ టెండరింగ్ ప్రతిపాదన..

  పీపీఏ ముందుకు రివర్స్ టెండరింగ్ ప్రతిపాదన..

  పోలవరం పనుల్లో అక్రమాలు జరిగాయని ,అవినీతి చోటు చేసుకుందంటూ కాంట్రాక్టు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రీ క్లోజర్‌ నోటీసును జారీ చేయడం పట్ల కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడంపై పీపీఏ ఇప్పటిదాకా తన మనసులోని మాటను బహిర్గతం చేయలేదు. రివర్స్‌ టెండర్‌పై కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖనుంచి ఇప్పటి వరకూ ఎలాంటి దిశానిర్దేశం లేదని చెబుతోంది. అయితే, రాష్ట్రం ఎందుకు కాంట్రాక్టు సంస్థలకు ప్రీ క్లోజర్‌ నోటీసును జారీ చేసిందో తెలుసుకునేందుకే ఈ సమావేశ ప్రధాన ఉద్దేశం. నవయుగ, బెకమ్‌ చేయగా మిగిలిన పనులకు ఈ బెంచ్‌మార్క్‌ ధరకే టెండర్లను పిలవడం వల్ల ధర పెరుగుతుందనేందుకు ఆస్కారమే లేదని, అయితే, గియితే అంతో,ఇంతో తక్కువ ధర కే సంస్థలు కోట్‌ చేసి పనులు తీసుకుంటాయని జల వనరుల శాఖ చెబుతోంది. రివర్స్‌ టెండరింగ్‌కు ఎందుకు వెళ్లాల్సి వస్తుందో పీపీఏకు సమగ్రంగా వివరిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ చెబుతోంది. తమ వాదనతో పీపీఏ కూడా సమ్మతిస్తుందని ఈ శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది.

  జగన్ ప్రతిపాదనకు నో చెబితే..

  జగన్ ప్రతిపాదనకు నో చెబితే..

  పీపీఏ ఏపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందనే దాని పైన చర్చ మొదలైంది. గతంలో చంద్రబాబు హాయంలో 14 శాతం లెస్ కు కాంట్రాక్టర్ ను ఒప్పించారు. అయితే, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆ స్థాయి ధరలకు అప్పగిస్తే తీసుకొనేందుకు కొత్తగా ఎవరైనా ముందుకు వస్తారా అనేది సందేహమే. ఇదే సమయంలో నవయుగ సంస్థ న్యాయ పరమైన పోరాటానికి సిద్దం అవుతే పరిస్థితి ఏంటనేది మరో కీలక అంశం. పీపీఏ మాత్రం ఏపీ వాదన..కారణాలు పూర్తిగా తెలుసుకొని కేంద్రానికి నివేదిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు పోలవరం భవితవ్యం ఏంటనేది ఈ సమావేశంలో కొంత మేర స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Polavaram Project Authority meeting to day to discuss AP Govt new proposal Reverse Tendereing. Central Water Resources and PPA Officials discuss with AP officers on this matter and give plan of action.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more