పోలవరం డిజైన్ మార్పు కుదరదు: సుజనా, స్పష్టమని
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చడం జరిగే పని కాదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. విభజన చట్టంలో ఉన్నవే ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్పారు.
హైదరాబాద్ పోలీసింగ్, పోలవరంపై విభజన చట్టంలో స్పష్టంగా ఉందని సుజనా చౌదరి తెలిపారు. కొత్త సమస్యలు సృష్టించేందుకే పోలవరంపై రగడ చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాజధానిపై తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

రైల్వే బడ్జెట్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తగ్గట్టుగా ఉందని సుజనా చౌదరి అన్నారు. వచ్చే బడ్జెట్‌లో తమ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
కాగా, మంగళవారం పోలవరం ఆర్డినెన్స్‌ను లోకసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ సభ్యులు ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బుధవారం ఉదయం లోకసభ సమావేశాలు ప్రారంభంకాగానే తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications