ఏపీ ప్రయోజనాల మేరకే: ‘మహా’ మంత్రి వినోద్, ‘కేంద్రానిదే బాధ్యత’
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల మేరకే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మహారాష్ట్ర మంత్రి వినోద్ తావ్డే అన్నారు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బీజేపీ ముఖ్య నేతలతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన పోలవరం అంశంపై మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకోదని స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. తనకు చిత్తూరు, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు. శనివారం హిందూపురం పార్లమెంటు పరిధిలోని నాయకులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

కేంద్రానిదే బాధ్యత: సోమిరెడ్డి
పోలవరంపై కేంద్రం అనుసరిస్తున్న తీరు సరిగా లేదంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు.
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం ఉదారంగా వ్యవహరించాలని కోరారు. ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని సోమిరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తాము ఒత్తిడికి తీసుకొస్తామని సోమిరెడ్డి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్లే నిధుల అంచనా భారీగా పెరిగిందని అన్నారు.












Click it and Unblock the Notifications