వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

27వ జిల్లా ఏర్పాటు.. జిల్లా కేంద్రం అదే, మూడో గిరిజన జిల్లా: మంత్రి పేర్ని నాని

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇటీవల కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పడిన సంగతి తెలిసిందే. దానిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. విమర్శలు వస్తోన్న.. మరో అడుగు ప్రభుత్వం ముందుకు వేసింది. మరో జిల్లాను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం సంకేతాలను ఇచ్చింది. ఈ మేరకు మంత్రి పేర్ని నాని దానికి సంబంధించి ప్రకటన చేశారు.

కొత్త జిల్లా ఏర్పాటు

కొత్త జిల్లా ఏర్పాటు

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు. మంత్రి చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొత్తగా ఏర్పాటు అయిన 13 జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాల నుంచి పాలన కూడా ప్రారంభమైంది. ఏపీలో మరో జిల్లా రూపుదిద్దుకోనుందని మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్స్ చర్చకు దారితీసింది. ఆ కొత్త జిల్లా ఏదీ? దాని పేరు ఏంటి? ఏఏ జిల్లాల నుంచి విడదీస్తారు? దీంతో ఏఏ గ్రామాలు కలిసి కొత్త జిల్లాగా ఏర్పడుతుంది? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.

రెండు గిరిజన జిల్లాలు

రెండు గిరిజన జిల్లాలు

పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కలెక్టర్లు, ఎస్పీలను కూడా నియమించింది. 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని మంగళవారం పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలన్నీ కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటికే రెండు గిరిజన జిల్లాలు ఉండగా.. మూడో జిల్లా ఏర్పడనుంది.

పోలవరం జిల్లా

పోలవరం జిల్లా

గిరిజన ప్రాంతాల్లో రెండు జిల్లాలు ఏర్పాటు చేశామని.. మరో జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. పాలనను మరింత సులభతరం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. పోలవరం, రంపచోడవరం రెండు నియజవర్గాలను కలిపి 27 వ జిల్లాగా ఏర్పడే అవకాశం ఉంది.

పోలవరం జిల్లా కేంద్రంగా కొత్త జిల్లాగా ఏర్పడనుంది. పోలవరం ప్రాజెక్టుకి దగ్గరలో రెండు నియోజకవర్గాలను కలిపి బ్రిడ్జ్ నిర్మాణం చేసే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని సమాచారం. దీనికి సంబంధించి త్వరలో ప్రకటన రానుంది. అన్నీ వర్గాలను సంతోష పరచాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు మంత్రి పేర్ని నాని తెలియజేశారు.

English summary
polavaram to established another district in andhra pradesh. cm ys jagan is thinking minister perni nani said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X