వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ క్యాబినెట్‌లో మార్పులు మాకు అనుకూలం: చంద్రబాబు

కేంద్ర మంత్రివర్గంలో జరిగిన మార్పులు రాష్ట్ర ప్రయోజనాలకు సానుకూలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

అమరావతి : కేంద్ర మంత్రివర్గంలో జరిగిన మార్పులు రాష్ట్ర ప్రయోజనాలకు సానుకూలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానం, అంతర్గత జల రవాణా మార్గాల ఏర్పాటు వంటి కీలక అంశాలకు ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలు వుంటే త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర జల వనరులు, నదుల అభివృద్ధి, నౌకాయానం శాఖలను, రహదారులు, రవాణాశాఖకు అనుసంధానం చేసి నితిన్ గడ్కరీకి అప్పగించడం అనుకూలాంశమని అన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ఆయనతో నిన్ననే మాట్లాడానని ముఖ్యమంత్రి సోమవారం రాత్రి పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టులపై జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. క్షేత్రస్థాయిలో పోలవరం పనుల పరిశీలన కోసం అవసరమైతే కేంద్ర మంత్రిని రాష్ట్రానికి ఆహ్వానిద్దామని అన్నారు.

ఇప్పటి వరకు 27 శాతం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టు పనులలో పాలుపంచుకుంటున్న నిర్మాణ సంస్థ 'త్రివేణి' అతి పెద్ద యంత్రాన్ని వినియోగంలోకి తెచ్చిందని, 30 క్యూబిక్ మీటర్ల పని సామర్ధ్యం గల ఈ యంత్ర సహాయంతో రోజుకు 9 వేల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు.

Polavaram works will be done day and night:Chandrababu

సోమవారం రాత్రి నుంచి రాత్రింబవళ్లూ ఎర్త్ వర్క్ చేస్తున్నామని, అలా చేయడం ద్వారా 18 వేల క్యూబిక్ మీటర్ల మేర పని పూర్తిచేయగలమని తెలిపారు. స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులు ఈనెలాఖరులోగా పూర్తిచేస్తామని వెల్లడించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సంబంధించి రెండు పంపులు పూర్తిస్థాయిలో పనిచేయిస్తున్నామని అధికారులు చెప్పారు. మూడవ పంపును బిగింపు పనులు పూర్తి చేశామని, 4 వ పంపును సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నిర్ణిత సమయంలోగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనులు పూర్తికాకపోవడానికి మోటార్లు అందించాల్సిన బీహెచ్ఈఎల్ సంస్థ నిర్లక్ష్య వైఖరే కారణమని చెప్పారు. రేడియల్ గేట్లు, ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం వంటి అన్ని పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయాల్సివుందని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

Recommended Video

Modi Cabinet Reshuffle On Sunday : Modi Plans For 2019 So Who Gets What | Oneindia Telugu

ఈనెల 7, 8, 9 తేదీలలో ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు విస్తృతంగా కురియవచ్చని షార్ అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. రాయలసీమ జిల్లాలలో వచ్చేవారం 30 నుంచి 40 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావచ్చునని చెప్పారు. వచ్చే పది రోజులలో తుంగభద్రకు 20 టీఎంసీల నీరు చేరవచ్చునని అంచనా వేస్తున్నట్టు అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఉన్న జలవనరులను వాస్తవ సమయంలో వివరించేందుకు www.apwrims.ap.gov.in పేరిట వెబ్ పోర్టల్‌ను సిద్ధం చేశామని అధికారులు చెప్పారు.

ఈ జియో పోర్టల్ ఇంటరాక్టీవ్ మ్యాప్‌ను అందిస్తుందని, సూక్ష్మ, మధ్య తరహా సాగునీటి వనరులు సహా రాష్ట్రంలో వున్న అన్ని సాగునీటీ వనరుల సమగ్ర వివరాలు అందుబాటులో వుంటాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 923.81 టీఎంసీల మేర జలవనరుల లభ్యత ఉన్నట్టు చెప్పారు.

ఈనెల 6, 7, 8 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 'జలసిరికి హారతి' కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక పండగ వాతావరణంలో ప్రజల మధ్య ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తొలిరోజు విశాఖ జిల్లా శారదనది, తోటపల్లి రిజర్వాయర్ దగ్గర జరిగే కార్యక్రమాలలో తాను పాల్గొంటున్నానన్నారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu said that the Polavaram works will be done day and night
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X