డ్రగ్స్ ముఠా పట్టివేత: జూనియర్ ఆర్టిస్టులకు సరఫరా
హైదరాబాద్: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు శనివారంనాడు పట్టుకున్నారు. వారి నుంచి 90 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిలో ఇద్దరు నైజీరియన్లు కాగా, ఇద్దరు హైదరాబాదీలు. వారు కొకైన్‌ను జూనియర్ ఆర్టిస్టులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇదిలావుంటే, హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 70 కేజీల వెండి పట్టుబడింది. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఓ మహిళ వద్ద నుంచి 70 కే జీల వెండిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మాదకద్రవ్యాలను ఢిల్లీ నుంచి తెచ్చి అమ్ముతుండగా పట్టుకున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. నైజీరియన్లు కొకైన్‍ను షూలేయర్‌లో పెట్టుకుని తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. పోలీసులకు పట్టుబడిన హైదరాబాదీలనను మాదాపూర్‌కు చెందిన సాయి ప్రవీణ్, న్యూబోయిన్‌పల్లికి చెందిన నవ్యశ్రీగా గుర్తించారు.

కాగా, కర్నూలు నగరంలో ప్రమాదవశాత్తు గన్ పోలి ఓ యువకుడు గాయపడ్డాడు. నగరంలోని సుకుమార్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద ఉన్న లైసెన్స్ గన్‌తో బుధవారంనాడు ఫొటో దిగేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు గన్ పేలింది.
గాయపడిన అతడ్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications