మహిళలను క్యాబ్ ఎక్కించుకొని..: ఇద్దరు డ్రైవర్ల అరెస్ట్

Police arrest 2 cab drivers for outraging modesty of women
హైదరాబాద్: మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు క్యాబ్ డ్రైవర్లను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. విమానాశ్రయంలో పని చేసే నగరానికి చెందిన మహిళ గత డిసెంబర్ 16వ తేది రాత్రి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ ఎక్కింది. మార్గమధ్యలో క్యాబ్ డ్రైవర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించగా ప్రతిఘటించింది. ఆమె దగ్గరున్న డబ్బు, బంగారం దోచుకొని పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఐదు రోజుల క్రితం అదే క్యాబ్ డ్రైవర్, మరో క్యాబ్ డ్రైవర్ ఎయిర్ పోర్టులో ఓ మహిళను ఎక్కించుకున్నారు. క్యాబ్‌ను నగరం వైపు కాకుండా మరో వైపుకు మరలించారు. దీంతో ఆమె కేకలు వేయడంతో పాటు స్నేహితులకు సమాచారం ఇచ్చింది. దాంతో ఆమెను కూడా వారు మార్గమధ్యలో వదిలేసి వెళ్లారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు సంఘటనలు ఒకే రకంగా జరగడంతో పోలీసులు క్యాబ్ డ్రైవర్ల పైన నిఘా పెట్టారు. వారి కారును గుర్తించి సీజ్ చేశారు. వారిని రిమాండుకుతరలించారు.

మరోవైపు, చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో అత్యాచారయత్నం చేయబోగా ప్రతిఘటించిన యువతిపై నలుగురు యువకులు కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో గాయపడ్డ బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలి వాంగ్మూలంతో వారాసిగూడకు చెందిన ఇసాక్, ఇస్మాయిల్, మరో ప్రాంతానికి చెందిన షకీల్, షబ్బీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు ఈ కేసుపై అన్ని విషయాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. సంఘటన సమయంలో నిందితులు నలుగురు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు చెబుతున్నప్పటికీ యువతి మాత్రం వారి పేరునే చెబుతోంది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+