ఉద్యోగాలు ఇప్పిస్తామని..., అరెస్ట్ (ఫోటో)
విశాఖ: కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి, డబ్బుకాజేసిన వేర్వేరు కేసుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను శనివారం నాడు రెండవ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ డీఎన్ మహేష్ వెల్లడించారు.
విజయనగరానికి చెందిన ఉపేంద్ర విశాఖ జిల్లా కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని నగరంలోని అళ్లిపురానికి చెందిన దంపతులు శ్రీనివాస్, సౌజన్య కుమారిల వద్ద రూ.3.48 లక్షలు వసూలు చేశారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోడవంతో దంపతులు నేరుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయసూర్యను సంప్రదించారు. దీంతో విషయం బయటకు వచ్చింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

మరో కేసులో.. సీతమ్మపేట ప్రాంతానికి చెందిన బంగారు రాజు, అక్కయపాలేనికి చెందిన పవన్ కుమార్‌లు కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని సింహాచలం ప్రాంతానికి చెందిన చిట్టిబాబు అనే వ్యక్తి వద్ద రూ.3 లక్షలు వసూలు చేసారు. అంతేసాకుండా నకిలీ నియామక పత్రాలు సృష్టించి ఉద్యోగం వచ్చేసిందని నమ్మబలికారు. అయితే, అవి నకిలీవి అని తెలుసుకున్న బాధితులు మోసపోయామని గుర్తించి, పోలీసులను ఆశ్రయించారు. వీరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications