వీధి నాటకంలో అశ్లీల నృత్యాలు: పోలీసులపై రాళ్ల దాడి

ఘటనకు సంబందించిన వివరాలను కళ్యాణదుర్గం డిఎస్పీ వేణుగోపాల్, సర్కిల్ ఇన్ స్పెక్టర్ వంశీధర్ గౌడ్ వెల్లడించారు. ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అప్పిలేపల్లిలో శనివారం అర్ధరాత్రి ‘బెబ్బులి రాయుడు' వీధి నాటకం ప్రదర్శించారు.
అయితే ఆ నాటకంలో కళాకారులు అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు కుందుర్పి పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే వారు అక్కడికి చేరుకుని నాటకాన్ని నిలిపేసి, లైట్లు ఆర్పివేశారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ స్పృహ కోల్పోవడంతో ఆగ్రహించిన కొందరు.. పోలీసులపైకి రాళ్లు విసిరారు.
అంతేగాక పోలీసులకు చెందిన రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పంటించి దగ్ధం చేశారు. దీంతో సిఐ వంశీధర్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన 40 మందిలో 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగితా వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications