ప్రియుడిని పట్టించిన టీవీ యాంకర్, డీఆర్డీవో ఆర్డీపై దాడి

Police arrested Anchor's lover
హైదరాబాద్: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సహజీవనం చేసి చివరకు మోసం చేసి పెళ్లికి సిద్ధమైన వ్యక్తిని టీవీ యాంకర్ పోలీసులకు పట్టించినట్లుగా తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం ఆమె హైదరాబాదు పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను మోసం చేసి మరో యువతితో పెళ్ళికి సిద్ధమయ్యాడని తన ఫిర్యాదులో తెలిపింది. ఈ క్రమంలో పోలీసుల సాయంతో ఆమె విశాఖ వెళ్ళింది.

అక్కడ పెళ్ళి హడావుడిలో ఉండగా... హఠాత్తుగా టీవీ యాంకర్ పోలీసులతో ప్రత్యక్షమవడంతో సదరు నిందితుడు పరారయ్యాడు. అయితే, పోలీసులు ఎట్టకేలకు అతడిని అరెస్టు చేశారు. అతడు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పేరు మల్లిఖార్జున రావుగా తెలుస్తోంది. బీటెక్ పూర్తి చేసిన అతడు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మబలికి టీవీ యాంకర్‌తో ఇన్నాళ్ళూ సహజీవనం చేశాడు. కాగా, పోలీసులు అతడిని అరెస్టు చేసి, హైదరాబాద్ తరలించారు.

డీఆర్డీవో రీజినల్ డైరెక్టర్‌పై బ్లేడుతో దాడి

చార్మినార్ వద్ద డీఆర్డీవో రీజనల్ డైరెక్టర్ సత్యపతి పైన ఓ దుండగుడు బ్లేడుతో దాడి చేశాడు. మహిళ మెడలోని గొలుసు చోరీకి యత్నించిన దొంగను పట్టుకునేందుకు సత్యపతి ప్రయత్నించారు. దాంతో ఆ దొంగ ఆయనపై బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. గాయపడిన సత్యపతిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఒడిశాలోని సోనాపేట డీఆర్డీవోలో రీజినల్ డైరెక్టరుగా పని చేస్తున్న సత్యపతి హైదరాబాదులోని డీఆర్డీవోలో జరుగుతున్న ఓ కాన్ఫరెన్సులో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు.

భర్త మృతి తట్టుకోలేక భార్య మృతి

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని యాగర్లపల్లికి చెందిన వృద్ధ దంపతులు అమ్మిరెడ్డి, బార్య ఉదయ భాస్కరం శనివారం రాత్రి మృతి చెందారు. అమ్మిరెడ్డి చనిపోయిన పదిహేను నిమిషాలకే భార్య కూడా మృతి చెందింది. వారికి ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+