విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్కే బీచ్‌ ఉద్రిక్తం: ఎక్కడికక్కడే యువత, జగన్ పార్టీ నేతల హౌజ్ అరెస్ట్

ప్రత్యేక హోదా కోసం యువత తలపెట్టిన మౌనదీక్షతో ఆర్కే బీచ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

|
Google Oneindia TeluguNews

విశాఖట్నం: ప్రత్యేక హోదా కోసం యువత తలపెట్టిన మౌనదీక్షతో ఆర్కే బీచ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హోదా నిరసన నేపథ్యంలో పోలీసులు విశాఖ నగరాన్ని దిగ్బంధించేశారు. ప్రజలు, యువకులు బీచ్‌కు రాకుండా అడ్డుకుంటున్నారు. మౌన దీక్ష కోసం తరలివస్తున్న యువతను, వైసీపీ, జనసేన శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. విశాఖతోపాటు విజయవాడ, కాకినాడ, తిరుపతిల్లో కూడా నిరసనకు దిగిన యువతను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు.

ఏయూ వద్ద యువత

ఏయూ వద్ద యువత

ఇప్పటికే మౌన దీక్ష కోసం వస్తున్న 30మంది యువతీయువకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. టూరిస్టులను సైతం ఆర్కే బీచ్‌కు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.

ఎక్కడ చూసినా పోలీసులే..

ఎక్కడ చూసినా పోలీసులే..

వైయస్సార్ కాంగ్రెస్ నేత వంశీతోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు కూడా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.

చెక్ పోస్టులు

చెక్ పోస్టులు

కాగా, స్థానిక గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో పలువురు యువకులు నిరసన తెలిపారు.
విశాఖ నగరం మొత్తం చెక్ పోస్టులను పెట్టడంతో యువకులు ఆర్కే బీచ్ చేరుకోలేకపోతున్నారు.

నిరసనలకు చెక్

నిరసనలకు చెక్

ఇది ఇలా ఉండగా, విజయవాడ కృష్ణ లంక పోలీస్ స్టేషన్ ముందు జనసేన పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.

ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు..

ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు..

తిరుపతిలో కూడా యువత చేస్తున్న నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్వీ వర్సిటీలో పరిపాలన భవనం ముందు నిరసన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
Police arrested youth at RK beach in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X