వైఎస్ షర్మిలకు షాక్- చంద్రబాబు వద్దకు బయల్దేరగానే..!

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఇవాళ విజయవాడలో పోలీసులు షాకిచ్చారు. ఇవాళ ఉదయం నుంచీ రైతు సమస్యలపై సీఎం చంద్రబాబును కలవబోతున్నట్లు ప్రకటించి నానా హంగామా చేసిన ఆమెకు చివరి నిమిషంలో పోలీసులు అడ్డుకోవడంతో షాక్ తగిలింది. దీంతో విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలకూ, పోలీసులకూ మధ్య తోపులాట చోటు చేసుకుంది.

రైతుల సమస్యలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు పీసీసీ ఛీఫ్ షర్మిల ఇవాళ ట్రాక్టర్ లో బయలు దేరారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి ఆమె బయలుదేరగానే పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. దీంతో ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేక ప్రాణాలు తీసుకొంటున్నారని, రైతుల ఆత్మహత్యల్లో 3 వ స్థానం ఉండటం సిగ్గుచేటని షర్మిల విమర్శించారు.

Police Block YS Sharmila s Attempt to Meet Chandrababu Over Farmer Issues

రాష్ట్రంలో రైతుల పరిస్థితి వర్ణనాతీతమని, వారి ఇబ్బందులు కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని షర్మిల ఆరోపించారు.
ఒకప్పుడు ఆంధ్రలో రైతు రారాజని, వైఎస్సార్ హయంలో వ్యవసాయం సువర్ణయుగమని తెలిపారు. రాష్ట్రం అన్నపూర్ణ అన్నారు. వైఎస్ తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద చేశారని, 12 వందల కోట్లు బకాయిలు మాఫీ చేశారని గుర్తుచేశారు. రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్ అన్నారు. వైఎస్సార్ రైతు పక్షపాతి అని గుర్తుచేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయానికి సాయం లేదని,అన్ని సబ్సిడి పథకాలు ఎత్తివేశారని షర్మిల ఆరోపించారు. రైతు మరణాల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉన్నామన్నారు రైతుకి రాష్ట్రంలో భరోసా లేదని, పండిన పంటకు గిట్టుబాటు లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు రైతులను మోసం చేశారని, ఎన్నికల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పారని షర్మిల తెలిపారు. రైతును రాజు అన్నారని, రైతును సుభిక్షంగా చూసుకుంటాం అన్నారని, మద్దతు ధర లేకపోతే గిట్టుబాటు ధర కల్పిస్తాం అంటారని, కానీ చెప్పిన మాటలకు చంద్రబాబు చేతలకు సంబంధం లేదన్నారు.

Police Block YS Sharmila s Attempt to Meet Chandrababu Over Farmer Issues

టమాటా ధర రెండు రూపాయలా ?, ఉల్లి కి ధర క్వింటాలు 50 రూపాయలు ఇస్తారా ? రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు అందలేదని షర్మిల విమర్శించారు. మిర్చి కి 12 వేలు ఇస్తామని 6 వేలు కూడా ఇవ్వలేదన్నారు. జొన్నలకు 3300 msp ఉంటే 2 వేలు ధర దక్కలేదన్నారు. పొగాకు రైతులకు 18 వేలు దక్కాల్సిన చోట 3వేలు కూడా ఇవ్వలేక పోయారన్నారు. అరటి రైతులకు 30 వేలు ఇవ్వాల్సి ఉండగా టన్నుకు 15 వేలు కూడా పలకలేదన్నారు. పెసర,మినుము,వేరు సెనగ, ఇలా ఏ పంటకు గిట్టుబాటు లేదన్నారు. పత్తి పంట రైతుల తిత్తి తీసిందన్నారు. ఉల్లి రైతులకు 12 వందలు ఇస్తామని మోసం చేశారని, టమాటా రైతులకు ధర తగ్గితే 8 రూపాయలు ఇస్తాం అన్నారని, మార్కెట్ కిలో ధర 2 రూపాయలు కూడా లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+