పవన్ కల్యాణ్ ముందు బంపర్ ఆఫర్ పెట్టిన కేఏ పాల్
విశాఖపట్నం: విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష భగ్నమైంది. పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులతో ఘర్షణకు దిగారాయన. తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన కేఏ పాల్ ఓ దశలో సీఐ కాలర్ పట్టుకోవడం కనిపించింది.
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణ పేరుతో కేఏ పాల్ నిరాహార దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్ర్రైవేటీకరణ నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇచ్చారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సోమవారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేంద్రం దిగి వచ్చేంత వరకూ దీక్షను కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశారు.

తన అనుచరులతో కలిసి ఆశీల్‌మెట్ట సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో దీక్షకు కూర్చున్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిలిపివేస్తానంటూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటనే కేంద్రంతో మాట్లాడాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
పవన్ కళ్యాణ్‌పైగా ఘాటు విమర్శలు చేశారాయన. జనసేనను ప్రజా శాంతి పార్టీలో విలీనం చేయాలని సూచించారు. ఫ్యాన్స్ అందరూ ప్రజా శాంతి పార్టీలో చేరాలని విజ్ఞప్తి చేశారు. తన పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. బీజేపీని గెలిపించమని వంద జన్మలు ఎత్తినా ప్రజలు ఆ పార్టీకి ఓటు వేయరని అన్నారు. తనతో కలిసి వస్తే పవన్‌ను ఇంటర్నేషనల్ స్టార్ చేస్తానని చెప్పారు.
విశాఖపట్నం: కేఏ పాల్ సేవ్ స్టీల్ ప్లాంట్ దీక్ష భగ్నం ఆసుపత్రికి తరలింపు..!#KAPaul #VizagSteelPlant #Vishakapatnam #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/LX5BSA2nce
— oneindiatelugu (@oneindiatelugu) August 29, 2023
రెండో రోజుకు దీక్ష చేరిన నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆయన దీక్షను భగ్నం చేశారు. అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఈ సమయంలో పోలీసులతో ఘర్షణకు దిగారు కేఏ పాల్. సీఐ కాలర్‌ను పట్టుకున్నారు. కేఏ పాల్ అరెస్ట్‌ను అడ్డుకోవడానికి ఆయన అనుచరులు ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications