వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి, యువతులు సహా 12 మంది అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నగర శివార్లలో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార గృహాల పైన సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీఎం (ఓఎస్‌టీ) పోలీసులు దాడులు నిర్వహించారు. హయత్ నగర్, సరూర్ నగర్, మల్కాజి గిరి పోలీసు స్టేషన్ పరిధిలలో ఈ దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

మొత్తం పన్నెండు మందిని అరెస్టు చేశారని సమాచారం. వీరిలో ఎనిమిది మంది మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. కాకినాడ, విజయవాడ నుండి అమ్మాయిలను తీసుకు వచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారని విచారణలో తేలింది.

Police bust sex racket, twelve arrested

కాగా, హైదరాబాద్ నగరం సుబ్రహ్మణ్యనగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని తెలుసుకున్న హయత్‌నగర్‌ పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. నిర్వాహకురాలు, ఓ సెక్స్‌వర్కర్‌, విటుడిని అదుపులోకి తీసుకున్నారు. దేశబట్టెన వరలక్ష్మి సుబ్రహ్మణ్యనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది.

వివిధ ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం చేయిస్తోంది. విశ్వసనీయ సమాచారంతో హయత్‌నగర్‌ సీఐ వెంకటేశ్వర్లు సోమవారం ఆ ఇంటిపై దాడి చేశారు.

నిర్వాహకురాలు విజయలక్ష్మి, సెక్స్‌వర్కర్‌తో పాటు రాగన్నగూడకు చెందిన విటుడు రవిచంద్రకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. సెక్స్‌వర్కర్‌ను రెస్క్యూ హోంకు, విటుడిని, నిర్వాహకురాలిని జైలుకు తరలించారు. అలాగే, పోలీసులు జవహర్ నగర్ సాకేత్ ఫేజ్ 2లోని ఓ బ్రోతల్‌పై దాడి చేసి ఓ మహిళకు విముక్కి కలిగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+