చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుత్తూరులోని ఇంట్లో టెర్రరిస్టులు, కాల్పులు: సిఐ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

terrorist
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచరంతో తమిళనాడు పోలీసులు శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. బాంబులు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఐ, కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీంతో ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనపై చిత్తూరు ఎస్పీతో డీజీపీ ఫోన్‌లో సంభాషించారు. తమిళనాడు పోలీసులకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా సహకరిస్తున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన సిఐ లక్ష్మణ్ మరణించారు. ఆయనను చెన్నై ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

పుత్తూరులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోందని డిజిపి ప్రసాదరావు హైదరాబాదులో అన్నారు. ఆక్టోపస్ బృందాన్ని పుత్తూరుకు పంపించినట్లు ఆయన తెలిపారు. చిత్తూరు ఎస్పీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఇంట్లో దాక్కున్నది ఎవరో ఇంకా తేలలేదని ఆయన చెప్పారు.

ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో తమిళనాడు పోలీసులు శనివారం తెల్లవారు జామున పుత్తూరు మేదర వీధిలోని ఓ ఇంటిని చుట్టుముట్టి సోదాలు నిర్వహించారు. ఎస్ఐని ఉగ్రవాదులు బంధించినట్లు తెలుస్తోంది. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

English summary
With a tip of information Tamil Nadu police raided a house, where terrorists took shelter at Putturu in Chittoor district in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X