మల్లాది విష్ణు ఆదాయంపై ఆరా: కల్తీమద్యంపై ఉక్కుపాదమంటూ మంత్రి
విజయవాడ: కల్తీ మద్యం కేసులో విచారణను ఎదుర్కుంటున్న కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు, ఆయన బంధువుల ఆదాయం పన్ను వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ సమాచారం కావాలంటూ ఆదాయపు పన్ను అధికారులకు పోలీసులు లేఖ రాశారు.
ఇదిలా ఉండగా, మల్లాది విష్ణు కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలని కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ నేడు విచారణకు రానుంది.

కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
విజయవాడ స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం సేవించి మరణాలు సంభవించిన నేపథ్యంలో పోలీసులు మల్లాది విష్ణును, ఆయన సోదరుడు శ్రీనివాస్‌ను మరింత మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కల్తీమద్యంపై కఠిన చర్యలు
రాష్ట్రాన్ని సారా రహిత రాష్ట్రంగా తయారు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎక్సైజ్‌శాఖపై మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం సమీక్ష నిర్వహించారు. మద్యం బార్ల నిబంధనలపై కొందరు కోర్టును ఆశ్రయించారని, రెన్యువల్ కోసం ఇప్పటి వరకు 200 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలు పాటించిన వారికే లైసెన్సులు ఇస్తామని ఆయన స్పష్టంచేశారు. పట్టణాల్లో కొత్తగా 44 బార్లకు అనుమతులు ఇస్తామని వెల్లడించారు. కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపుతామని రవీంద్ర అన్నారు. ఈ సమావేశానికి ఎక్సైజ్‌శాఖ కమిషనర్ మీనా, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
-
పిడుగులు, భారీ వర్షాలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications