రేవంత్‌పై కేసు, సభలో ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలని హైదరాబాదులోని నాంపల్లి కోర్టు పోలీసులను సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నెల 6వ తేదీ లోగా దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావుల పైన రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది గోవర్ధన్ పిటిషన్ దాఖలు చేశారు. దాని ఆధారంగా కోర్టు పైవిధంగా స్పందించి కేసు నమోదు చేయలని ఆదేశించింది. దీంతో కోర్టు కేసు నమోదు చేసింది.

టీడీపీ ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలకు తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం జీరో అవర్‌లో టీడీపీ ఎమ్మెల్యే కొమ్ములపాటి శ్రీధర్ ప్రసంగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి కర్టెన్ ఇనుప రాడ్డు జారి పడింది. ఎమ్్మెల్యేలకు కొద్దిదూరంలో పడటంతో ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనకు శాసన సభ్యులు కంగారుపడ్డారు. అనంతరం మార్షల్స్ ఇనుప రాడ్డును అక్కడి నుండి తొలగించారు.












Click it and Unblock the Notifications