పవన్ ను బెదిరించిన వ్యక్తి గుర్తింపు-గతంలో హోంమంత్రికీ-బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి ఫోన్ చేసి ఆయన్ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్, మెసేజ్ లు చేసిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇలాంటి బెదిరింపులు రావడంపై ఆయన పేషీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే సమయంలో హోంమంత్రి అనిత కూడా స్పందించి డీజీపీతో మాట్లాడారు. అనంతరం అనితకు కూడా గతంలో అదే నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు తేలింది. దీంతో ఆ నంబర్ ను పోలీసులు గుర్తించారు.

డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ని చంపుతానని ఫోన్ లో ఆయన పేషీ సిబ్బందిని బెదిరించిన వ్యక్తి విజయవాడకి చెందిన మల్లిఖార్జునగా పోలీసులు గుర్తించారు. మల్లిఖార్జున కోసం నాలుగు పోలీసు బృందాలు ఏర్పాటు చేసిన విజయవాడ సీపీ గాలింపు ముమ్మరం చేశారు. నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు , విజయవాడ నగరంలో విస్తృతంగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

police identified the man give life threats to pawan kalyan home minister also a victim

పవన్ ను బెదిరించిన మల్లికార్జునరావు తిరువూరులో ప్రముఖ వైద్యుల దంపతులకు బావమరిది అవుతాడని గుర్తించారు. గత కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసవడంతో మల్లికార్జునను భార్య కూడా వదిలి వెళ్లిపోయినట్లు గుర్తించారు. నెల్లూరులో నివాసం ఉంటూ డబ్బుల కోసం అతను తరచూ తిరువూరు వస్తున్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం నెల్లూరు నుంచి తిరువూరు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం నుంచి విజయవాడలోనే తిరుగుతున్న మల్లికార్జునరావు...ఇలా పవన్ పేషీకి ఫోన్ కాల్స్ చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఉపముఖ్యమంత్రి పవన్ పేషీకి బెదిరింపు కాల్స్ నేపథ్యంలో హోంమంత్రి అనిత స్పందించారు. కాల్స్, మెసేజ్ ల గురించి డీజీపీ ద్వారకా తిరుమలరావుతో హోంమంత్రి చర్చించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీ ఇచ్చిన వివరాల మేరకు తన కాల్స్ హిస్టరీలో ఆ నంబర్ ఉన్నట్లు గమనించిన హోంమంత్రి..డిప్యూటీ సీఎం పేషీకి వచ్చిన నంబర్ల నుంచే తన మొబైల్ కూ కాల్స్ వచ్చాయని నిర్ధారించుకున్నారు. ఇదే విషయంపై డీజీపీతో ఫోన్ లో మాట్లాడారు. గతంలోనూ ఆ నంబర్ల నుంచి ఫోన్ లు వచ్చిన కాల్ హిస్టరీ ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆ ఆకతాయిలెవరో వెతికి పట్టుకోవాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+