న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు: సిపి సివి ఆనంద్

హైదరాబాద్: 2013 సంవత్సరంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది 27,156 కేసులు నమోదు చేశామనితెలిపారు. నిర్భయ చట్టం కింద 110 కేసులు, సైబర్ క్రైమ్ కింద 103 కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. కొత్త సాఫ్ట్‌వేర్‌తో సైబర్ కేసులు చేధిస్తున్నామని ఆనంద్ చెప్పారు.

ఔటర్ రింగ్‌రోడ్డుపై పార్కింగ్ చేసిన వాహనాలు, అతివేగమే ప్రమాదాలకు కారణమని ఆనంద్ శర్మ తెలిపారు. మహిళలపై దాడులను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఎవరైనా ఆపదసమయంలో 9494731100కు ఫోన్ చేయాల్సిందిగా ఆనంద్ శర్మ తెలిపారు.

cv anand

జనవరి ఒకటి నుంచి నగరంలో పటిష్టంగా భద్రతా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. నగరంలో మరికొన్ని సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఆనంద్ శర్మ స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించినట్లు సివి ఆనంద్ ప్రకటించారు. హోటళ్లు, రిసార్టులు, పబ్బులు లాంటి స్థలాల్లో అశ్లీల కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

డిజె సౌండ్ 45 డిసిబుల్స్ మించకూడదని ఆదేశించారు. హోటల్, రిసార్టులలో అనుమతి లేకుండా లిక్కర్‌ను వినియోగించరాదని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు జరుపుకోవచ్చని తెలిపారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. రహదారులపై టపాసులను కాల్చేందుకు అనుమతి లేదని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని సివి ఆనంద్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+