చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు - వెళ్లిపోవాలి : దమ్ముంటే రండి- కుప్పంలో హైటెన్షన్..!!

కుప్పంలో హై టెన్షన్ కొనసాగుతోంది. కుప్పంలో మూడు రోజుల పర్యటన కోసం చంద్రబాబు కుప్పం పర్యటనకు బయల్దేరారు కుప్పంలో ఉదయం నుంచి చంద్రబాబు సభలకు అనుమతి లేదంటూ పోలీసులు పార్టీ నేతలను అడ్డుకున్నారు. సభలో వినియోగించే ప్రచార రధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి కుప్పం చేరుకొనే క్రమంలో పెద్దూరులో పోలీసులు చంద్రబాబును అడ్డుకున్నారు. పోలీసులు - చంద్రబాబు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రోడ్ షోలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసారు. దీంతో, పోలీసులు రోడ్డు పైన తన కాన్వాయ్ ఆపివేసి అందులో కూర్చిని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

చంద్రబాబు కుప్పం పర్యటన హై టెన్షన్ వాతావరణానికికారణమైంది. ప్రభుత్వం తాజాగా రోడ్ షోలు..బహిరంగ సభలను రోడ్ల పైన నిర్వహణకు అనుమతి నిరాకరించింది. ఆంక్షలు విధించింది. ప్రభుత్వం నుంచి అనుమతితోనే ప్రత్యేక సందర్భాల్లో సభల నిర్వహణకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, కుప్పం పర్యటనలో భాగంగా శాంతిపురం మండలంలో చంద్రబాబు రోడ్ షోలకు ప్లాన్ చేసారు. మూడు రోజుల పర్యటనకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేసారు. దీని కోసం ఉదయం నుంచే పోలీసులు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు రోడ్ షో లకు అనుమతి లేదంటూ టీడీపీ నేతల ఏర్పాట్లకు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీనిని టీడీపీ శ్రేణులు ప్రతిఘటించారు. ఫలితంగా వాగ్వాదం..తోపులాట చోటు చేసుకున్నాయి. చంద్రబాబు బెంగుళూరు నుంచి కుప్పం చేరుకొనే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు.

కిందటి నెలలోనే దరఖాస్తు చేసాము


సభలకు అనుమతి లేదని, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా రోడ్ షోలకు అనుమతి ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేసారు. చంద్రబాబును కుప్పంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో, చంద్రబాబు సీరియస్ అయ్యారు. పోలీసు అధికారుల పైన మండిపడ్డారు. అనుమతి లేదని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేసారు. అక్కడకు చిత్తూరు జిల్లా టీడీపీ నేతలతో పాటుగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. ప్రభుత్వం - పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. తన సొంత నియోజకవర్గంలోకి రావటానికి ఆంక్షలు విధిస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహించారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావటంతో పోలీసులు భారీగా మొహరించారు. దీంతో, అక్కడ ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. గత నెలలోనే కుప్పంకు వస్తానని డీజీపీ లేఖ రాసానని చంద్రబాబు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీన ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చింది.

కుప్పం నుంచి కదిలేదు లేదు


రోడ్ షోలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఈ జోవో తెచ్చింది. ముఖ్యమంత్రి సభలకు బాధలు పెట్టి డ్వాక్రా మహిళలను తరలిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యమని..తనకు మాట్లాడే స్వేఛ్చ ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి వణుకు పుట్టిందని వ్యాఖ్యానించారు. తాను ఎక్కడ రోడ్ షోలు పెట్టినా ప్రజానీకం పెద్ద ఎత్తున వస్తున్నారని వివరించారు. ఏ చట్టం ప్రకారం ఈ జీవో తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేసారు. 1861 ప్రకారం తీసుకొస్తే మద్రాసు ప్రెసిడెన్సీకి ఇది వర్తించదని..ఎడాప్ట్ చేసుకొని గజెట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. రెండో తేదీన జీవో ఇస్తే.. 1వ తేదీ నుంచి యాక్ట్ 30 అమల్లో ఉందని పలమనేరు డీఎస్పీ నోటీసు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నియంత పాలన చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+