మీడియాకు పోలీసుల బ్రేక్ : బాబు అనంత పర్యటనలో జర్నలిస్టుల నిరసన

అనంతపురం : ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురం పర్యటన నేపథ్యంలో.. హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు కోసం పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన జర్నలిస్టులకు.. పోలీసులకు బ్రేక్ వేయడంతో కొంత వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం.

విజయవాడ పరిధిలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి.. కొద్దిసేపటి క్రితమేఅనంతపురంలోని పుట్టపర్తి అంతర్జాతీయ విమానశ్రయంలో అడుగుపెట్టారు చంద్రబాబు. అయితే సీఎం పర్యటనను కవర్ చేసేందుకు అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు.

Police stopped journalists in chandrababu anantapuram tour

అప్పటికే మంజూరు చేసిన పాసులను సైతం.. జర్నలిస్టులు వెంట తీసుకెళ్లినా ఎయిర్ పోర్టులోకి అడుగుపెట్టినవ్వలేదు పోలీసులు. పోలీసుల చర్యను మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వారించే ప్రయత్నం చేసినా.. ఆయన మాటను పోలీసులు చెవిన పెట్టలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా.. తమకు మంజూరు చేసిన పాసులను ఎయిర్ పోర్టు ప్రధాన గేటుకు వేలాడదీసి నిరసన వ్యక్తం చేశారు జర్నలిస్టులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+