పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న పోలీసులు: కాన్వాయ్ దిగి కాలి నడకన ముందుకు: ఉద్రిక్తత..!
జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి తరలింపుకు నిరసనగా స్థానిక రైతులు..మహిళలు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా పవన్ రాజధాని గ్రామాల్లో పర్యటన చేస్తున్నారు. నవులూరు..ఎర్రబాలెం వద్ద స్థానికులకు మద్దతు ప్రకటించిన తరువాత మందడం మీదుగా తుళ్లూరు వెళ్లేందుకు పవన్ తన కాన్వాయత్ లో ముందుకు వెళ్తున్నారు. ఆ సమయంలో మండదం వద్ద పోలీసులు పవన్ ను అడ్డుకున్నారు. నేరుగా తుళ్లూరు వెళ్లాలని సూచించారు. అక్కడే ఉన్న గ్రామస్థులు పవన్ ను తమ గ్రామంలోకి రానీవాలంటూ నినాదాలు చేసారు.
దీంతో..వపన్ కారు దిగి నడుచుకుంటూ అక్కడి నుండి మందడం వైపు వెళ్తున్నారు. పవన్ వెంట గ్రామస్థులు ముందుకు కదులుతున్నారు. పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో..అక్కడ ఉద్రిక్తత పరిస్తితులు ఏర్పడ్డాయి. మధ్నాహ్నం వరకు మందడం వెళ్లేందుకు అనుమతి ఇవ్వమని పోలీసులు తేల్చి చెబుతున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి ఉండటంతో..అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేసారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు..సమీప గ్రామాల ప్రజలు పద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.

మందడానికి నాలుగు కిలో మీటర్ల దూరం ఉన్నా..పవన్ కాలి నడకనే ముందుకు సాగుతున్నారు. పవన్ వెంట పార్టీ నేతలు.. పెద్ద సంఖ్యలో రైతులు ఉన్నారు. వెంకటపాలెం వద్ద బారికేడ్లను పెట్టి మందడం లోపలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మొహరించారు.












Click it and Unblock the Notifications