వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పులిచింతల'కు వైసీపీ ఎమ్మెల్యే-పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత-ఏపీ రైతుల హక్కులను కాలరాస్తున్నారని ఫైర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదానికి తెరపడట్లేదు. కృష్ణా జలాల కేటాయింపులు,నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఇప్పటికే ఇరు రాష్ట్రాలు ఘర్షణ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానును రెండు రాష్ట్రాల సరిహద్దులో తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ముక్త్యాల గ్రామంలో ఆయన్ను అడ్డుకున్న పోలీసులు ప్రాజెక్టు సందర్శనకు అనుమతించమని చెప్పారు. దీంతో పోలీసులతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగగా స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. తెలంగాణ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ప్రస్తుతం మరో మార్గంలో ఆయన పులిచింత ప్రాజెక్టును సందర్శించేందుకు బయలుదేరారు.

జలమార్గంలో ప్రాజెక్టు వద్దకు...

జలమార్గంలో ప్రాజెక్టు వద్దకు...

తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జలమార్గంలో పులిచింతల సందర్శనకు బయలుదేరారు. ముక్త్యాల,మాదిపాడు మీదుగా ఆయన పులిచింతల ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వను ఆయన పరిశీలించనున్నారు. నిజానికి ప్రాజెక్టులో నీటి నిల్వ తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఉదయభాను ఆరోపిస్తున్నారు. తెలంగాణ చర్యలతో కృష్ణా డెల్టా బీడుగా మారే పరిస్థితి తలెత్తుతుందని అంటున్నారు.

ఏపీ రైతుల హక్కులను కాలరాస్తున్నారని...

ఏపీ రైతుల హక్కులను కాలరాస్తున్నారని...

ముక్త్యాల వద్ద పోలీసులు అడ్డుకున్న సందర్భంలో ఉదయభాను మీడియాతో మాట్లాడారు. రైతుల అభ్యర్థన మేరకే తాను పులిచింతల ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చానన్నారు.పోలీసులు తనను అనుమతించకపోవడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు.కృష్ణా డెల్టాను స్థిరీకరించేందుకే పులిచింతల ప్రాజెక్టును నిర్మించారని... ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా అందులో నీటిని వాడుకుంటోందని ఆరోపించారు. అక్రమంగా నీటిని తరలిస్తూ ఏపీ రైతుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా కృష్ణా జలాలను వృథాగా సముద్రంలోకి వదులుతున్నారని ఆరోపించారు. తెలంగాణతో స్నేహంగా ఉందామని ఏపీ కోరుకుంటుంటే... వాళ్లే దూరం చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ నేతలు వైఎస్సార్‌ను అవమానించే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. వైఎస్సార్ ఏపీ కంటే తెలంగాణ ప్రజలకే చాలా చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం...

విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం...

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లి వద్ద క‌ృష్ణా నదిపై పులిచింతల విద్యుత్ కేంద్రం ఉంది. దీని సామర్థ్యం 120 మెగావాట్లు. గత వారం నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. అయితే దిగువకు సాగునీరు విడుదల చేసే సమయంలో లేదా ప్రాజెక్టులో నిర్దేశిత నీటిమట్టం కంటే ఎక్కువ నీరు ఉన్న సమయంలోనే విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అలా కాకుండా నిబంధనలకు విరుద్దంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులో నీటిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తోందని ఆరోపిస్తోంది. ప్రాజెక్టులో నీళ్లు లేకపోతే కృష్ణా డెల్టా రైతులు నష్టపోతారని వాదిస్తోంది. దీనిపై ఏపీ సీఎం జగన్ ఈ నెల 1న కేంద్రానికి లేఖ కూడా రాశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల్లో... ప్రస్తుతం పులిచింతల నుంచి తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా డ్రా చేస్తున్న నీటిని కూడా పరిగణలోకి తీసుకునేలా కేఆర్ఎంబీని ఆదేశించాలని కోరారు

English summary
Jaggayyapeta YCP MLA Saminee Udayabhanu, who was on a visit to the Pulichintala project, was stopped by Telangana police at the border between the two states. Police not allowed him to visit the project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X