Raghurama: రఘురామ గుండెలపై కూర్చున్న వ్యక్తికి పోలీసుల సమన్లు..!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, గత ప్రభుత్వంలో వైసీపీ ఎంపీగా ఉన్న కనుమూరు రఘురామకృష్ణంరాజుపై సీఐడీ కస్టడీలో దాడికి పాల్పడ్డ వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు.

ఈ కేసులో రఘురామరాజును హింసించిన అధికారులు, సిబ్బందిని ఇప్పటికే గుర్తించిన పోలీసులు ఇప్పుడు మరో ప్రైవేట్ వ్యక్తిని కూడా గుర్తించారు. దీంతో అతనికి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.

police summoned the person who sat on raghurama raju s chest during custodial torture

రఘురామరాజు ఎంపీగా ఉండగా ఆయన్ను అప్పట్లో రాజద్రోహం కేసులో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ రాత్రి ఆయనపై ముసుగు వేసుకున్న వ్యక్తులు దాడి చేశారు. అలా ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ముసుగులతో వచ్చి రఘురామపై దాడి చేశారు. ఇందులో ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే సీఐడీ విచారణలోకి ప్రవేశించి ప్రైవేటు వ్యక్తులు రఘురామపై దాడి చేశారని పోలీసులు తేల్చారు.

అలాగే ఇందులో ఒకరు రఘురామ గుండెలపై ఎక్కి కూర్చొన్నారు. రఘురామకు అప్పటికే గుండెకు సర్జరీ చేసి స్టంట్ వేసి ఉన్నారు. అయినా లెక్కచేయకుండా అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఒకరు ఇలా రఘురామ గుండెలపైకి ఎక్కి కూర్చొన్నారు. సదరు వ్యక్తిని కామేపల్లి తులసిగా రఘురామ గుర్తించారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి ఇతను గుడివాడకు చెందిన వాడిగా గుర్తించారు. అతన్ని ఇప్పుడు విచారణకు రావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసులు పంపారు.

అప్పట్లో రఘురామపై కస్టడీలో దాడి వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షించిన సీఐడీ ఏఎస్పీ విజయ్ పాల్ కు ఈ తులసి సన్నిహితుడని తేలింది. ఇప్పుడు విజయ్ పాల్ పై పోలీసుల విచారణలో ఈ విషయం గుర్తించారు. ఈ తులసి గుంటూరుతో పాటు గుడివాడ ప్రాంతాల్లో తిరుగుతుంటాడని తేల్చారు. ఈ మేరకు జనవరి 3న ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీసులో విచారణకు రావాలని అతనికి నోటీసులు ఇచ్చారు. విజయ్ పాల్ వాంగ్మూలం ఆధారంగా తులసిని గుర్తించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+