Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దారుణంగా హింసించారు- జగన్ ప్రభుత్వం వెయ్యిరెట్లు బెటర్ అనిపిస్తోంది

GV Harsha Kumar: పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆయన మరణంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఆయన హత్యకు గురై ఉండొచ్చనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

తూర్పు గోదావరి జిల్లా చాగల్లులో క్రైస్తవ మహాసభలకు హాజరు కావడానికి బుల్లెట్‌పై రాజమండ్రికి బయలుదేరిన ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

Police took GV Harsha Kumar into custody and released later

ప్రవీణ్ శరీరంపై గాయాలు ఉండటం, బలమైన వస్తువులతో కొట్టినట్టు కనిపించడం వల్ల పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులెవరైనా ఆయనను హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా సృష్టించే ప్రయత్నం చేసి ఉండొచ్చంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.

పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే అటు క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు అప్పట్లో. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందంటూ డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి ఉదంతం.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిలువెత్తు నిదర్శనమంటూ విమర్శించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్.. పాస్టర్ ప్రవీణ్ మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ పరిణామాలన్నింటిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ప్రవీణ్‌ది రోడ్డుప్రమాదమేనంటూ పోలీసులు నిర్ధారించారు.

ప్రవీణ్‌ పగడాల రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, అయనది హత్యేనంటూ పలువురు క్రైస్తవు సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కొంతమూరు-దివాన్‌ చెరువు రోడ్డులో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు.

Police took GV Harsha Kumar into custody and released later

అమలాపురం లోక్‌సభ మాజీ సభ్యుడు జీవీ హర్షకుమార్‌ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం సాయంత్రం వేలాది మంది క్రైస్తవులు ప్రవీణ్‌ మరణించిన స్థలానికి ర్యాలీగా చేరుకున్నారు. ఆయన ఫొటోకు నివాళి అర్పించారు. హర్షకుమార్‌, ఆయన కుమారుడు జీవీ శ్రీరాజ్‌‌తో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.

కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. హర్షకుమార్‌తో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులను ప్రతిఘటించారు. వారితో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హర్షకుమార్‌ను అనపర్తి పోలీస్ స్టేషన్‌కు, మిగిలిన వారిని రాజానగరానికి తరలించారు.

రాత్రి హర్షకుమార్‌ను పోలీసులు విడుదల చేశారు. అనంతరం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.

రాష్ట్రంలో పాలన అనేది ఉందా? అని ప్రశ్నించారు. బ్రిటీష్ పాలన కంటే అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ఇదేనా పాలన అంటూ చంద్రబాబును నిలదీశారు. రెండు దఫాలుగా లోక్‌సభకు ఎన్నికైన తనను అయిదు గంటల పాటు ఇష్టానుసారంగా కారులో తిప్పారని, నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లారని విమర్శించారు.

ఒక క్రిస్టియన్ ఫాదర్‌ను చంద్రబాబు చంపించారని, కేసులను తారుమారు చేశారని, ఇప్పటిదాకా పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌ను రిలీజ్ చేయలేదని ఆరోపించారు. చంద్రబాబుకు తెలియకుండా ఇదంతా జరగదని అన్నారు. క్రిస్టియన్లకు తాయిలాల కింద ఏడునెలల పింఛన్లు ఇచ్చేసి చంద్రబాబు అంతా చక్కబెట్టుకుందామనుకుంటున్నట్లు కనిపిస్తోందని జీవీ హర్షకుమార్ అన్నారు.

కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్యేనని నమ్ముతున్నారని జీవీ హర్షకుమార్ చెప్పారు. జగన్ హయాంలో చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు తాను నారా లోకేష్, భువనేశ్వరిని పరామర్శించానని, వాళ్లకు సంఘీభావాన్ని తెలియజేశానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దీనికి మంచి బహుమతిని తనకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్ ప్రభుత్వం వెయ్యిరెట్లు బెటర్ అనిపించిందని జీవీ హర్షకుమార్ చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+