Ysrcp: ఎమ్మెల్సీ అనంతబాబును నెమ్మదిగా తప్పిస్తున్నారుగా??
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ కారు డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పోలీసుల ఎదుట ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. అయితే ఈ కేసును బలహీనపరిచేందుకు సెక్షన్ల నమోదులో తింబిరి చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి అనంతబాబు కేసును పక్కదోవ పట్టించేందుకే అమలాపురం ఘర్షణలు తెరపైకి వచ్చాయనేది టీడీపీ వాదన.
అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం నేతిబీరకాయలో నెయ్యి చందాన ఉంటుందంటున్నారు. అంతేకాకుండా అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రమణ్యాన్ని కావాలని చంపలేదన్నట్లుగా నివేదిక సిద్ధం చేస్తున్నారంటూ చెబుతున్నారు. కేసును ఇలా బలహీనంగా పెట్టడంవల్ల బెయిల్ సులభవంగా వస్తుందని, అందుకు అనుగుణంగా వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. హత్యచేసిన నిందితుణ్ని కాపాడటానికి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ఒక ఎమ్మెల్సీ రంగంలోకి దిగారని ఆరోపిస్తున్నారు.

వైఎస్సార్ సీపీ పెద్దలకు ఆయన సన్నిహితుడవడంవల్లే కేసు విచారణ కూడా సవ్యంగా సాగడంలేదంటున్నారు. ప్రభుత్వం తరఫున సుబ్రమణ్యం కుటుంబానికి పరిహారం ఇస్తే సరిపోతుందన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అనంతబాబుపై కేసులు బలహీనంగా పెడితే న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications